ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్‌పూర్‌లో గ్రూమింగ్ జిహాద్‌కు సంబంధించిన మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. నవంబర్ 30న, హమీర్‌పూర్ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని బల్రాంపూర్ జిల్లా, జార్వా తులసీపూర్ డివిజన్, బాలాపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ మోబీన్ ను అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్ కాస్తా రాజేష్ యాదవ్ గా నటించి హిందూ బాలికను ప్రలోభపెట్టాడు. దీంతో అతడిపై పలు సెక్షన్లలో కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 376(3), 363, 366, 420, 342, 506, మరియు 295, పోక్సో చట్టంలోని సెక్షన్‌లు మరియు యుపిలోని చట్టవిరుద్ధంగా మత మార్పిడిపై నిషేధం సెక్షన్‌లు కింద కేసు నమోదు చేయబడింది.
పోలీసుల కథనం ప్రకారం, నాలుగు సంవత్సరాల క్రితం 2018లో రాజేష్ యాదవ్‌గా పరిచయమై ఒక మైనర్ బాలికను నమ్మించాడు. ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని నమ్మించాడు. ఆమెను లక్నో, తర్వాత బలరాంపూర్‌కు తీసుకువెళ్లాడు, అక్కడ ఇస్లామిక్ ఆచారాల ప్రకారం మోబీన్‌తో వివాహం చేసుకోవడానికి ముందు ఆమెను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. అనంతరం ఆమెను ముంబై తీసుకెళ్లాడు. మోబీన్ రాజేష్ యాదవ్ వేషం వేసుకుని మైనర్ బాలికకు తాను హిందువునని చెప్పినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
మోబీన్ బలవంతంగా మతమార్పిడి చేసి పెళ్లి చేసుకున్నాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మైనర్ బాలికతో అంగీకారం లేకుండా శారీరక సంబంధం కూడా పెట్టుకున్నాడు. ఆమెను నిత్యం కొట్టేవాడు. నిందితుడైన మోబీన్ అప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని బాధితురాలికి ఆ తర్వాత తెలిసింది. నిందితుడు బాలికను విక్రయించేందుకు కూడా ప్రయత్నించాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆ అమ్మాయి ఎలాగోలా తప్పించుకుని తన బిడ్డతో తన తండ్రి ఇంటికి చేరుకుంది. విషయం తెలుసుకున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. 2018లో మిస్సింగ్ రిపోర్టు ఇచ్చామని బాధితురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.
హమీర్‌పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమలేష్ దీక్షిత్ మాట్లాడుతూ, “నాలుగు సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు మౌదాహా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి తన నిజస్వరూపాన్ని దాచిపెట్టి హిందువుగా చూపించుకున్నాడు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. నిందితులపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం.” అని చెప్పుకొచ్చారు. విచారణ కొనసాగుతోందని, ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందో వారిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.