హలాల్ ను నిషేధిస్తూ గ్రీస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక మతానికి సంబంధించి దేవునికి.. అర్పించబడిన ఆహారాన్ని మేం ఎలా తీసుకుంటామని.. హలాల్ కు స్వస్తి చెప్పింది. గ్రీస్ అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో ఆ దేశంలో హలాల్ ను నిషేధించారు. ఇటీవల హలాల్, కోషర్ కిల్లింగ్‌ను నిషేధిస్తూ గ్రీస్ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. హలాల్ ఒక అమానవీయ చర్య అంటూ అభిప్రాయపడిన అపెక్స్ కోర్టు.. ఈ రెండు పద్దతుల్లో జంతువును మత్తుమందు లేకుండా చంపబడతాయని తెలిపింది. మత్తు మందు లేకుండా మతపరమైన వధ పద్ధతులను అనుమతించే చట్టంలోని…. మినహాయింపును రద్దు చేయాలని…. పాన్‌హెలెనిక్ యానిమల్ వెల్ఫేర్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఫెడరేషన్…. కోర్టును అభ్యర్థించింది. ఈ నేపథ్యంలోనే హలాల్, కోషర్ కిల్లింగ్ ను నిషేధిస్తూ గ్రీస్ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. అంతేకాదు, కబేళా పద్ధతులపై న్యాయస్థానం ప్రభుత్వానికి పూర్తి నిర్ణయాధికారాన్ని కట్టబెట్టింది. జంతువుల సంక్షేమాన్ని కాలరాస్తూ.. వాటి ఉత్పత్తులను తయారు చేయకూడదని ఆదేశించింది. మత్తుమందు లేకుండా జంతువులను వధించడం చట్టాన్ని అతిక్రమించడమేనని అభిప్రాయపడింది. ఇక, జంతు హక్కులు, మత స్వేచ్ఛ మధ్య సంబంధాన్ని నియంత్రించే బాధ్యతను కోర్టు ప్రభుత్వానికి వదిలివేసింది.
హలాల్ పద్దతిలో జంతువు హింసాత్మకంగా, క్రూరంగా చంపబడుతుంది. ఎందుకంటే, ఈ పద్దతిలో జంతువు మెడ కింద నాళాన్ని కత్తితో చీలుస్తారు. దీంతో.. అది రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ.. నరకయాతనను అనుభిస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా ప్రాణాలు విడుస్తుంది. హలాల్ ఇస్లామిక్ చట్టం, ఆచారాల ప్రకారం ‘అనుమతించదగినది’ కావచ్చు. కానీ, ఇతర మతాలకు హలాల్ అనుసరనీయం కాదు. హలాల్ మాంసాన్ని నేరుగా వినియోగించడమే కాదు.. మాంసపు ఉత్పత్తుల్లోనూ వాడుతున్నారు. దీంతో ఇస్లామేతర మతస్తులు కూడా హలాల్ మాంసాన్నే తినాల్సివస్తోంది. అయితే, యూదులు కూడా హలాల్ వంటి పద్దతుల్లోనూ జంతువధ చేస్తారు. దీంతో ఇప్పుడు ఈ రెండు మతాలు గ్రీస్ కోర్టు తీర్పుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఇదిలావుంటే, హలాల్ సర్టిఫికేషన్ అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా భారత్ లో ముస్లిం సమాజంలోని కొంతమంది అతివాదులు మాంసాహారంతో పాటు.. శాఖాహార ఆహార నియంత్రణపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ గుత్తాధిపత్యం ఏ రేంజికి వెళ్లిపోయిందంటే.. స్వతహాగా పతంజలి వంటి హిందూ కంపెనీలు కూడా ముస్లిం ధృవీకరణ సంస్థల నుండి హలాల్ సర్టిఫికేషన్ తీసుకోవాల్సిన దుస్థితి పట్టింది. హలాల్ సర్టిఫికేషన్ కోసం.. ఆహార ఉత్పత్తికి 500 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు డబ్బు వసూలు చేస్తున్నారు. అమెరికా, యూకే, భారత్ సహా అనేక దేశాల్లో, ఒక చిన్న మైనార్టీ ముస్లిం సమాజం….. మెజారిటీ కమ్యూనిటీని కూడా వారి ఆహార పద్దతులకు కట్టుబడి ఉండేలా చేస్తోంది. అంతేకాదు, ఇలా మాంసాహార ఆహార పరిశ్రమపై ముస్లింల గుత్తాధిపత్యం వల్ల.. హిందూ సమాజంలోని పలు కులవృత్తులవారు నిరుద్యోగులుగా మారిపోతున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే, నేడు హలాల్ పరిశ్రమ ‘ముస్లింల యొక్క, ముస్లింలచేత, కానీ, అందరికొరకు’ అన్నట్టు మారిపోయింది.
2019లో, మల్టీనేషనల్ ఫాస్ట్-ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్ భారతదేశంలో హలాల్ సర్టిఫైడ్ ఆహారాలను మాత్రమే అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మెక్ డొనాల్డ్ నిర్ణయంపై ముస్లిమేతర సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ లో రెండు దశాబ్దాల సుదీర్ఘమైన వ్యాపార అనుబంధం వల్ల.. ఈ ఫాస్ట్ ఫుడ్ చైన్ కు కొన్ని లక్షల మంది కస్టమర్లున్నారు. మెక్‌డొనాల్డ్స్ భారతీయ మార్కెట్లోకి వచ్చిన మొట్టమొదటి ఫాస్ట్ ఫుడ్ చైన్‌లలో ఒకటి. అన్ని ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్ గా నిలదొక్కుకుంది. అయితే, మెజారిటీ కస్టమర్లు ముస్లమేతరులైనప్పటికీ.. జంతువధ విషయంలో మాత్రం.. ఒక మతానికి మాత్రమే సంబంధించిన.. పురాతన, అమానవీయ విధానాలను ఆ కంపెనీ వదలడం లేదు.
అడ్రోయిట్ మార్కెట్ అధ్యయనం ప్రకారం, ప్రపంచ హలాల్ మార్కెట్ విలువ 4.54 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. ఇది భారత్, జర్మనీ లేదా యూకే జీడీపీ కంటే అధికం. 2025 నాటికి, ముస్లింల గుత్తాధిపత్యంతో ప్రపంచ హలాల్ ఇండస్ట్రీ 9.71 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అధికశాతం మంది వినియోగదారులు ముస్లిమేతరులుగా ఉన్న దేశంలో, కార్టెలైజేషన్, ఛాందసవాదం, ముస్లింల మధ్య ఐక్యత కారణంగా హలాల్ ఆహారాన్ని బలవంతంగా అందరి గొంతుల్లో కుక్కుతున్నారు. అయితే, బలవంతపు ధోరణికి గ్రీస్ ప్రభుత్వం చరమగీతం పాడింది. భారతదేశం వంటి నాన్-ముస్లిం మెజారిటీ దేశాల ప్రజలు కూడా.. గ్రీస్ ప్రభుత్వం లాగానే హలాల్ ను నిషేధించాలని కోరుకుంటున్నారు. మతం ఆధారంగా వివక్ష చూపే పరిశ్రమ ఏదైనా.. స్వేచ్ఛా మార్కెట్ల సమగ్రతకు హాని కలిగించడమే కాకుండా.. ఈ గుత్తాధిపత్యం వల్ల తీవ్రమైన ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
హలాల్ సర్టిఫికేషన్ మన దేశ లౌకిక సంప్రదాయానికి పూర్తిగా విరుద్ధం. ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య మాత్రమే కాదు, ఆర్ధిక జీహాద్ కూడా. ఇస్లాం దేశాలకు ఉత్పత్తులు ఎగుమతి చేయాలంటే హలాల్ సర్టిఫికెట్ తప్పనిసరి అని చెబుతున్నారు. కానీ అసలు ఉద్దేశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తు న్నాయి. మొగలుల కాలంలో జిజియా పన్ను గురించి విన్నాం. ఒక హిందువు హిందువుగానే ఉండాలి అంటే పాలకులకు పన్ను చెల్లించాలి. హలాల్ సర్టిఫికేషన్ వల్ల ఇంచుమించు అదే విధమైన ఆర్ధికపరమైన ఆంక్షలు హిందూ వ్యాపారవర్గం ఎదుర్కొంటోంది. హలాల్ సర్టిఫికేషన్ పేరిట జరుగుతున్న మతపరమైన ఆర్థిక దోపిడీ జిజియా పన్నుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. ఈ నేపథ్యంలో మన దేశంలో హలాల్ ను నిషేధించాలన్న డిమాండ్ ఈ మధ్య కాలంలో ఊపందుకుంటోంది. ఇతర దేశాల్లోనూ హలాల్ నిషేధంపై ఉద్యమాలు జరుగుతున్నాయి.
2019లో బెల్జియంలోని ఫ్లాండర్స్ ప్రాంతంలో హలాల్ మాంసంపై తొలుత నిషేధం విధించారు. తర్వాత వాలోనియాలో అమలు చేశారు. జంతువులు నరకయాతన పడకుండా చంపేముందు వాటికి ముందుగా కరెంటు ఇవ్వాలని యూరప్‌లో జంతుహక్కుల సంఘాలు కోరుతున్నారు. దీంతో పలు దేశాలు స్టన్నింగ్ విధానాన్ని అవలంబిస్తున్నాయి. స్వీడన్, డెన్మార్క్, స్విట్లర్లాండ్, న్యూజీలాండ్ తదితర దేశాల్లో హలాల్ మాంసంపై ఇప్పటికే నిషేధం ఉంది.