నిఖత్ జరీన్ కు హైదరాబాద్ లో ఘన స్వాగతం

0
909

ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌ గా నిలిచిన నిఖత్ జరీన్ హైదరాబాద్ కు రాగా.. అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ సొంత గడ్డ నిజామాబాద్ అనే సంగతి తెలిసిందే..! పతకం గెలిచాక ఆమె హైదరాబాద్ కు మొదటిసారి వస్తుండడంతో ఆమెకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. నిఖత్ జరీన్‌కు స్వాగతం పలికేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి కూడా ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఆమెకు పూల బొకే ఇచ్చి స్వాగతించారు. ప్రభుత్వం అందించిన సహకారంతోనే తను ఈ విజయం సాధించానని నిఖత్ జరీన్ వెల్లడించారు. భవిష్యత్‌లో మరిన్ని మెడల్స్ సాధిస్తానని నిఖత్ జరీన్ చెప్పుకొచ్చారు.

టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్‌ పోటీల్లో నిఖత్ జరీన్.. సరికొత్త చరిత్ర లిఖించింది. 52 కేజీల విభాగం ఫైనల్లో జరీన్ 5-0తో థాయ్‌లాండ్‌కు చెందిన జుటామస్ జిట్‌పాంగ్‌ను ఓడించి బంగారు పతకాన్ని అందుకుంది. ఈ ఘనత సాధించిన ఆరో మహిళా బాక్సర్‌గా రికార్డులకెక్కింది.