National

కాశ్మీర్ లోయలో రెపరెపలాడుతున్న తిరంగా.. తీవ్రవాద సంస్థలకు అసలు మింగుడు పడడం లేదు

జమ్మూ కాశ్మీర్ లోని లాల్ చౌక్ ప్రాంతంలో ఇటీవలే స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను మొదలుపెట్టారు. శ్రీనగర్‌లోని ఐకానిక్ క్లాక్ టవర్ ప్రాంతంలో త్రివర్ణం రెపరెపలాడుతోంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు శ్రీనగర్‌లోని క్లాక్ టవర్‌ను త్రివర్ణ దీపాలతో అలంకరించారు. రాత్రివేళ రంగు రంగుల విద్యుద్దీపాల మధ్య త్రివర్ణం ప్రకాశవంతంగా కనిపించేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్లాక్ టవర్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. కొత్త గడియారాలను సైతం అమర్చారు. ఇలాంటి దృశ్యం మొట్టమొదటిసారిగా ఆవిష్క్రతమైంది. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అక్కడి ప్రాంతంలో చాలా మార్పు వస్తోంది.

ఇక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దగ్గర పడుతూ ఉండడంతో దేశంలో విధ్వంసం సృష్టించాలని తీవ్రవాదులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆగష్టు 10న తీవ్రవాదులు లాల్ చౌక్ ప్రాంతంలో హ్యాండ్ గ్రెనేడ్ తో దాడి చేశారు. హరిసింగ్ హై స్ట్రీట్ ప్రాంతంలో, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. లక్ష్యం తప్పడంతో గ్రెనేడ్ రోడ్డుపై పడింది. ఈ పేలుడు ధాటికి స్థానిక పౌరులు గాయపడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. దాడి తర్వాత ఉగ్రవాదులు తప్పించుకున్నారు. ఈ దాడిలో దాదాపు ఏడుగురు గాయపడినట్లు సమాచారం. వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. శ్రీనగర్‌ లోని డిఐజి సిఆర్‌పిఎఫ్ కిశోర్ ప్రసాద్ మాట్లాడుతూ “మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో ఒక దుండగుడు ఎస్‌ఎస్‌బి బంకర్‌ను గ్రెనేడ్‌తో లక్ష్యంగా చేసుకున్నాడుని” వెల్లడించారు. దాడి జరిగిన వెంటనే భద్రతా దళాలు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అనంతనాగ్‌లో బీజేపీ సర్పంచ్ గులాం రసూల్ భట్ మరియు అతని భార్యను ఉగ్రవాదులు కాల్చి చంపిన తర్వాతి రోజే ఈ దాడి జరిగింది.

లోయలో త్రివర్ణ పతాకాలు.. తీవ్రవాద సంస్థల ఉక్రోషం

గత కొన్ని రోజులుగా, వందలాది త్రివర్ణ పతాకాలు లోయలో కనిపించాయి. ఇది ఉగ్రవాద సంస్థలకు కోపం తెప్పించింది. దాల్ సరస్సు ప్రాంతంలో జాతీయ జెండా ఆవిష్కరించబడింది. లాల్ చౌక్ వద్ద క్లాక్ టవర్ కూడా స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు త్రివర్ణ దీపాలతో వెలిగిపోతోంది. 2019 లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుండి ఉగ్రవాద సంస్థలలో కొత్త నియామకాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. పెరిగిన పెట్రోలింగ్, భద్రతా దళాల కఠిన చర్యలు లోయ లోని ప్రజలలో మార్పు రావడం వల్ల ఈ ప్రాంతంలో పరిస్థితి మెరుగుపరచడం సాధ్యమైంది. గత రెండేళ్లలో దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం లోయలో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

twenty − twenty =

Back to top button