జాతీయ భద్రతకు ముప్పు తెచ్చే 54 చైనీస్ మొబైల్ అప్లికేషన్‌లను నిషేధించేందుకు కేంద్రం సిద్ధమైందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు సోమవారం తెలిపాయి. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), టెన్సెంట్, అలీబాబా మరియు NetEase వంటి ప్రధాన చైనీస్ టెక్ కంపెనీలకు చెందిన ఈ అప్లికేషన్‌లను గుర్తించింది. స్వీట్ సెల్ఫీ HD, బ్యూటీ కెమెరా – సెల్ఫీ కెమెరా, ఈక్వలైజర్ అండ్ బాస్ బూస్టర్, టెన్సెంట్ ఎక్స్‌రివర్ మొదలైనవి బ్యాన్ చేసిన యాప్స్ లిస్ట్ లో ఉన్నాయి.
ఈ అప్లికేషన్‌లలో చాలా వరకు 2020లో భారతదేశం ఇప్పటికే నిషేధించింది. పేరు మార్చుకుని మళ్లీ కొంచెం కొత్త యాప్ ల లాగా మనకు కనిపిస్తాయి. 2020 నుండి చైనాకు చెందిన మొత్తం 270 యాప్‌లను నిషేధించిన తర్వాత.. ఈ ఏడాది ప్రభుత్వం నిషేధించిన తొలి యాప్‌ల లిస్టు ఇదే..! MeitY జూన్ 2020లో 59 చైనీస్ యాప్‌లను భారత సార్వభౌమాధికారం, సమగ్రత మరియు జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్నాయంటూ నిషేధించింది. ఈ జాబితాలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ యాప్స్ అయిన TikTok, Helo, WeChat, Kwai, Clash of Kings, Alibaba’s UC Browser, UC News, Likee, Bigo Live, Shein, Club Factory, Cam Scanner వంటివి ఉన్నాయి. భారత్ చైనా దేశాల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి. భారత భూభాగాన్ని ఆక్రమించాలని చైనా చేస్తున్న ప్రయత్నాలను భారత్ ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే 2020 జూన్ 15న గల్వాన్ లోయ వద్ద భారత్, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుల మధ్య ఘర్షణలకు దారితీసింది. చైనా కంపెనీల ఆర్ధిక మూలలను దెబ్బతీస్తూ.. భారత దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందనే కారణాలతో 2020లో చైనా యాప్స్‌లను నిషేధించిడం మొదలు పెట్టింది. 2020 జులై నెలలో టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లు, అదే ఏడాది సెప్టెంబరులో మరో 118 యాప్‌లు, నవంబరులో 43 చైనా యాప్‌లపై నిషేధం విధించింది. గతంలో బ్యాన్ చేసిన యాప్ లను రీబ్రాండ్ చేసి కొత్త పేర్లతో తిరిగి ప్రారంభించాయి. దీన్ని పసిగట్టిన భారత ప్రభుత్వం ఈ యాప్‌లను నిషేధించాలని మరోసారి ఆదేశాలు జారీ అయ్యాయి. వ్యక్తిగత భద్రత, ప్రైవసీకి భంగం కలిగిస్తుండడంతో కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయులకు సంబంధించిన సెన్సిటివ్ సమాచారాన్ని చైనాలో ఉన్న సర్వర్లకు చేరవేస్తున్నట్లు గుర్తించి ఆ యాప్స్ ను బ్యాన్ చేయాలని ప్రభత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న 60 పాకిస్తాన్ మద్దతు ఉన్న యూట్యూబ్ ఛానెల్‌లను బ్లాక్ చేసినట్లు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 10న రాజ్యసభకు తెలియజేసింది.
ఫేక్ న్యూస్, కమ్యూనికేషన్ ఏజెన్సీలకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలపై ప్రశ్నకు సమాధానమిస్తూ.. అన్ని సోషల్ మీడియా ఖాతాలతో సహా 60 యూట్యూబ్ ఛానెల్‌లను ప్రభుత్వం బ్లాక్ చేసిందని సమాచార మరియు ప్రసారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఎగువ సభకు తెలియజేశారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయడంలో పాలుపంచుకున్న ఆయా అకౌంట్లకు పాకిస్తాన్ మద్దతు ఉంది.