National

హిందూ సంఘటిత శక్తికి తలవంచిన సాంస్కృతిక శాఖ

ఏ జాతి అయినా సరే.. తన గత చరిత్రను మర్చిపోతుందో.., ఆ జాతికి మనుగడ ఉండదని తత్త్వవేత్తలు చెబుతుంటారు. ఒక జాతి.. జాతిగా మనగలుగుతుందా..? బ్రతికి బట్టకట్టగలుగుతుందా..? అభివృద్ధి చెందగలుగుతుందా? అన్నది కూడా.., ఆ జాతి నడవడిపైనే ఆధారపడి ఉంటుంది.

తనను గురించి, తన పూర్వీకులు చేసిన త్యాగాలు , పోరాటాల గురించి , తెలుసుకోలేని జాతికి మనుగడ ఉండదు.! అందుకే ఈ తరం విద్యార్థులు , యువకులు.., అందరు కూడా చరిత్రను అధ్యయనం చేయాలి. ఇది జాతి ప్రగతికి చాలా అవసరం. చరిత్రలో మన పాలకులు చేసిన తప్పిదాల నుంచి.., మనం గుణపాఠాలు నేర్చుకోవాలి.! శత్రువుల పట్ల ఊదాసినత , అతి మంచితనం పనికిరాదు. మన పాలకులు చేసిన తప్పిదాలు…, భారత దేశాన్ని వందల ఏళ్లు బానిసత్వంలో మ్రగ్గిపోయేలా చేశాయన్న విషయాన్ని మనం మర్చిపోరాదు. అలాంటి తప్పులనే…, మళ్లీ… ఈ ఆధునిక కాలంలో.., ఇప్పుడు కూడా మన పాలకులు చేస్తుంటే.., మనం ఏం చేయాలి? ఇది తప్పు అని గుర్తు చేయాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి పౌరుడిపై ఉంటుంది.

అలాంటి ఘటనే ఇప్పుడు నేను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. కేంద్రంలో ప్రస్తుతం ఉన్నది నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రఖర జాతీయవాద ప్రభుత్వం.! దీన్ని ఎవరు కాదనలేరు.! అయితే లెఫ్ట్ లిబరల్ లుటియెన్స్, ఇంకా సూడో సెక్యులరిస్టులు, వామపక్ష చరిత్రకారులు గత డెబ్బై ఏళ్లుగా అనేక ప్రభుత్వశాఖల్లో… ఇంకా వ్యవస్థలలో చొచ్చుకుపోయి తిష్టవేసిన్నది నిప్పులాంటి నిజం. మన భారత దేశ చరిత్రను మార్క్స్ , మేకాలవాద కళ్ళజోళ్లు పెట్టుకుని ఇంతకాలం మనకు బోధిస్తూ వచ్చారు. మనల్ని ఒక రకమైన ఆత్మనూన్యత భావనలోకి నెట్టారు.

భారత్ అంటే ఒక వలసవాద దేశమని.., ఆర్యులు అలాగే కామన్ ఏరాకు పూర్వం వచ్చారు, ఇంకా శకులు, హుణులు వచ్చారు, ఆ తర్వాత కాలంలో అరబ్బులు, తురుష్కులు వచ్చారు. అటు మధ్య ఆసియాకు చెందిన మొగలులు వచ్చారు…, అనంతరం యూరోప్ దేశాల వారు వచ్చారు. వారిలో బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించారు. ఇంకా చెప్పాలంటే…! భారత్ కు తనదైన అస్థిత్వమే లేదు.! మొగలులు, బ్రిటీష్ వారు వచ్చిన తర్వాతనే…, భారత్ కు ఒక దేశమంటూ అస్థిత్వమేర్పడిందని కట్టుకథలు చెబుతుంటారు. తుక్డే తుక్డే గ్యాంగులకు ఈ కట్టుకథలను బోధించిన ప్రొఫెసర్ల మూకలు…, యూనివర్శిటీల్లో ఇంకా యాక్టివ్ గానే ఉన్నాయనే విషయం మనం గుర్తు పెట్టుకోవాలి.

ఇక్కడ విషయం ఏమిటంటే…? కేంద్రంలో నరేద్రమోదీ ప్రభుత్వం వచ్చి ఏడేళ్లు అయ్యింది. అనేక ప్రభుత్వ శాఖల్లో, వ్యవస్థల్లో తిష్టవేసుకున్న ఈ జాతి వ్యతిరేక తుక్డే తుక్డే గ్యాంగులను ఇంకా ఎందుకు ఏరివేయడం లేదు? అంటూ సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేయడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం.!

దేనికైనా… ఒక పద్ధతి , ఒక ప్రొసిజర్ ఉంటుంది.! డిపార్ట్ మెంట్ కు డిపార్ట్ మెంట్ కు మధ్య సవాలక్ష ఫార్మలిటీలు, ప్రొటోకాల్ నిబంధనలు ఉంటాయి. మోదీ ఏడేళ్లు అయినా దేశ వ్యతిరేక తుక్డే తుక్డే గ్యాంగుల ఏరివేత ఇంకా ఎందుకు జరగడం లేదు అంటూ ప్రశ్నించే వారికి కూడా ఈ విషయాలు తెలుసు.! మన దేశం… డెమోక్రటిక్ కంట్రీ.! డిక్టేటర్ షిప్ ఉన్న…, నియంతృత్వ దేశం ఏంతమాత్రం కాదు.!

ఈ లెఫ్ట్ లిబరల్.., తుక్డే తుక్డే గ్యాంగులు.., మన వ్యవస్థల్లో చొచ్చుకుని పోయి.., ఒకదానితో ఒకటి లింకప్ అయి.., పకడ్బందిగా ఒక పెద్ద చైన్ సిస్టమ్ మాదిరిగా రక్షణ వ్యవస్థలను రూపొందించుకున్నాయి. మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రక్షాళనను… తుక్డే తుక్డే గ్యాంగ్ యొక్క…, చైన్ సిస్టమ్ లో భాగమైనా… లుటియెన్స్ మీడియా జర్నలిస్టులు, స్వయం ప్రకటిత మేధావులు, ఫిలిమ్ మేకర్స్, యాక్టివిస్టులు నిత్యం ఏదో ఒక రూపంలో గత ఏడేళ్లుగా మోదీ ప్రభుత్వాన్ని అడ్డుకుంటునే ఉన్నాయన్నది నిజం.! త్రిబుల్ తలాక్ నుంచి మొదలు పెడితే సీఏఏ అల్లర్ల వరకు, అలాగే హిస్టరీ రీ రైటింగ్ నుంచి మొదలు పెడితే నూతన విద్యా విధానం వరకు పదే పదే అడ్డుతుగులుతున్న ఘటనలు మనం ఇప్పటికే అనేకం చూశాం.

ఏదీ ఏమైనా…., ! ప్రజల్లో చైతన్యం రానంత వరకు , నిగ్గదీసి ప్రశ్నించే తత్త్వం పెరగనంత వరకు.., ఈ జాతి వ్యతిరేక శక్తుల ఆటలు ఇలాగే సాగుతాయి.! ఒక్కసారి… మనం ప్రశ్నించడం మొదలు పెడితే.., దేశ వ్యతిరేక మూకలు అన్ని చెల్లచెదరూ కాకతప్పదు.!

ఈ నెల ఆగస్టు 23న ప్రముఖ ఆన్ లైన్.., వెబ్ పోర్టల్ ఓపీ ఇండియా ఆసక్తికరమైన ఒక స్టోరీని పోస్టు చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన సాంస్కృతిక శాఖ ‘నోఇండియా'(knowindia.gov.in) పేరుతో ఒక వెబ్ సైట్ ను రన్ చేస్తోంది.ఇందులో భారత దేశచరిత్రను తెలిపే క్రమంలో… మధ్యయుగ భారత్ అనే శీర్షికలో.., మన దేశంపై దండేత్తివచ్చిన విదేశీ దురాక్రమణదారులైన మొగలులను కీర్తించడాన్ని.., ప్రముఖ రచయిత రతన్ శారద ప్రశ్నిచడం జరిగింది.

మొగలులను కీర్తిస్తున్నారు సరే..,! హిందువులపైనా, సిక్కులపై మొగల్ పాలకులు జరిపిన అత్యాచార్యలు, హత్యలు, వారు ధ్వంసం చేసిన ఆలయాలను కూడా హైలైట్ చేస్తూ చెబితే బాగుండేదంటూ వ్యంగ్య ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ వెంటనే సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందించడం మొదలు పెట్టారు. కేంద్ర సాంస్కృతిక శాఖ తీరును తమదైన వరుస ప్రశ్నలతో నిలదీశారు.! కొంతమంది నెటిజన్లు అయితే దుర్మార్గ పాలన జరిపిన మొగలుల చరిత్రను గొప్పగా కీర్తిస్తున్నారు సరే…! హిందూ రాజులు పాల, ప్రతిహార, రాష్ట్ర కూట , కళింగ , రాజపుత్ర వీరులు, అసోమ్ రాజులు , శివాజీ మహారాజ్ హిందూ స్వరాజ్యం, బాజీరావ్ పేష్వా చేసిన యుద్ధాలు, సిక్కు గురువుల బాలిదానాలపై కేవలం పేరా గ్రాఫ్ లకు పరిమితం చేయడమేంటని ప్రశ్నించారు.
ఈ విమర్శల వేడితాకిన తర్వాత కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ దిగివచ్చింది. మధ్యయుగ భారత దేశం విభాగంలో మొగల్ పాలకులకు అంకితం చేసిన ఆ పేజీ మొత్తంలో సమూల మార్పులు చేసింది.

ఈ మొత్తంగా ఈ వ్యవహారంలో భారతీయులుగా మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే…! హిందూ సమాజం సంఘటిత శక్తిగా మారి.., తమ పాలకులు జరుపుతున్న అన్యాయాలను చట్టపరిధిలో నిలదీస్తే…, తప్పక దిగివస్తారుని అర్థం అవుతోంది.

సో… ఇప్పటికైనా సమయంలో మించిపోయింది ఏమి లేదు.! దేశ హితం కోసం హిందూ సమాజం ఒక్కటి కావాలి. సంఘటిత శక్తిగా మారాలి. భారత్ మాతాకీ జై.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

19 − 4 =

Back to top button