National

94 యూట్యూబ్ ఛానళ్లు బ్యాన్.. ఎందుకో తెలుసా..?

ఇటీవల సోషల్ మీడియాల్లో నకిలీ వార్తల వ్యాప్తి ఎక్కువైంది. దీంతో నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని యూట్యూబ్ ఛానళ్లను నిషేధించిన కేంద్రం.. తాజాగా మరికొన్ని యూట్యూబ్ ఛానళ్లను నిషేధించింది.

2021-22 మధ్యకాలంలో 94 యూట్యూబ్ ఛానళ్లు, 19 సోషల్ మీడియా ఖాతాలు, 747 యూఆర్ఎల్ వెబ్‌సైట్లపై నిషేధం విధించింది. దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకున్నారు.

ఈ మేరకు వైకాపా ఎంపీ అయోధ్య రామిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖిత పూర్వకంగా సమాధానం తెలిపారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా నకిలీ వార్తల వ్యాప్తి కట్టడికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2020 ప్రకారం.. గతేడాది ఫిబ్రవరి 25 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను రూపొందించినట్లు మంత్రి తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

4 + one =

Back to top button