More

    ఊహించని విధంగా విమానంలో వైద్యం చేసిన గవర్నర్ త‌మిళిసై

    తెలంగాణ గవర్నర్‌గా కొన‌సాగుతున్న త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ రాజ‌కీయాల్లోకి రాక‌ముందు వైద్యురాలిగా ప‌ని చేశారు. తాజాగా ఆమె మ‌రోసారి వైద్యురాలిగా మారిపోయారు. విమానంలో ఆమె వైద్యురాలిగా మారి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఓ ప్ర‌యాణికుడికి చికిత్స అందించారు. త‌మిళిసై ప్రాథ‌మిక చికిత్స‌తతో అనారోగ్యం నుంచి తేరుకున్నాడు. ఆ ప్ర‌యాణికుడు ఆమెకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ బ‌య‌లుదేరిన ఇండిగో విమానంలో త‌మిళిసై ప్ర‌యాణిస్తున్నారు. ఉన్న‌ట్టుండి ఓ ప్ర‌యాణికుడు అస్వ‌స్థ‌త‌కు గురి కాగా, విమాన సిబ్బంది డాక్ట‌ర్లు ఎవ‌రైనా ఉన్నారా? అని అనౌన్స్‌మెంట్ చేశారు. దీంతో వెంట‌నే స్పందించిన త‌మిళిసై… నేరుగా బాధిత ప్ర‌యాణికుడి వ‌ద్ద‌కు వెళ్లి ఆయ‌న‌కు ప్రాథ‌మిక వైద్యం చేశారు. బాధితుడు కోలుకున్నాక‌ విమాన సిబ్బందికి ఆమె కొన్ని సూచ‌న‌లు చేశారు. విమానం బ‌య‌లుదేరే ముందే ప్ర‌యాణికుల్లో డాక్ట‌ర్లు ఉన్న‌ట్లయితే, ముందుగా చార్ట్‌లోనే విష‌యాన్ని తెలియ‌జేయాల‌ని ఆమె సూచించారు.

    spot_img

    Trending Stories

    Related Stories