ప్రపంచంలోనే యంగెస్ట్ కంట్రీ ఇండియా అన్నారు గవర్నర్ తమిళిసై. ఓయూలోని దూర విద్యాకేంద్రంలో యువతకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు, ముఖ్య అథితిగా ఆమె హాజరయ్యారు. IIGH సంస్థ ఐదు రోజులపాటు యువతకు పొలిటికల్ లీడర్ షిప్ క్లాసులు ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. సీఎం అంటే కామన్ మ్యాన్, పీఎం అంటే పబ్లిక్ మ్యాన్ అన్నారు గవర్నర్. ఏ పార్టీ నాయకుడైనా ప్రజలకు సేవ చేయాలన్న ఆమె…ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నవారే అసలు నాయకులన్నారు. అలాగే వైద్య రంగంలో భారత్ అన్ని దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.