కొవిడ్‎ మరణాలను తగ్గించిన ‘గోత్రం’..! ఇదుగో శాస్త్రీయ ఆధారం..!!

0
743

కరోనా వైరస్‎కి కులం లేదు, మతం లేదు. అది ఎవరికైనా సోకుతుంది. మందులేని ఈ మహమ్మారి ఏ వర్గం వారికైనా ప్రాణాంతకమే. కానీ, హిందువుల కంటే.. ముస్లింలు, క్రిస్టియన్లపై ఎక్కువ ప్రభావం చూపుతోందట. హిందూ సంప్రదాయంలో అనాదిగా వస్తున్న గోత్ర వ్యవస్థ.. కరోనా మరణాలను గణనీయంగా తగ్గిస్తోందట. ఇలా చెబుతున్నానని ఇదేదో వివక్ష అనుకోకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ Council Of Scientific and Industrial Research కు చెందిన శాస్త్రవేత్త.. సశాస్త్రీయంగా చెప్పిన గణాంకాలనే మీముందుంచుతున్నాం. ఇప్పుడు ఆ వివరాలేంటో చూద్దాం.

2019 చివర్లో వెలుగుచూసిన కరోనా మహమ్మారి.. ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్లమందికి సోకిన కరోనా వైరస్.. 42 లక్షల మందిని బలితీసుకుంది. మనదేశంలో ఇప్పటివరకు 3 కోట్ల 15 లక్షమంది కొవిడ్ బారిన పడితే.. 4 లక్షల 20 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సిన్ల రాకతో పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. అయినా, రూపం మార్చుకుంటూ విడతలుగా దాడిచేస్తుండటంతో.. మహమ్మారి భయం ఇంకా తొలగిపోలేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సమయానుకూల నిర్ణయాలతో తొలి దశను పకడ్బందీ కట్టడి చేయగలిగాం. కానీ, రెండో దశలో కొన్ని ఇబ్బందులు తప్పలేదు. అయినప్పటికీ ప్రపంచ దేశాలతో పోలిస్తే.. మనదేశంలో వైరస్ వ్యాప్తి రేటు గానీ, మరణాల శాతం గానీ చాలా తక్కువగా నమోదైంది.

భారత్‎లో హిందూ జనాభా ఎక్కువగా వుండటం వల్లనే ఇతర దేశాలకంటే తక్కువగా వున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆశ్చర్యంగా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం. క్రిస్టియన్ మెజారిటీ దేశమైన అమెరికా కంటే మనదగ్గర ఆరు రెట్లు తక్కువ మరణాల రేటు నమోదైంది. ‘కొవిడ్ డెత్ రేట్ చూసుకుంటే భారత్ లో తప్ప.. మిగతా అన్ని దేశాల్లో దాదాపు ఒకే ప్రభావం కలిగివుంది. కానీ, మన దగ్గర మాత్రం ఇప్పటికీ అత్యల్పంగానే వుంద’ని చెబుతున్నారు CSIR కు చెందిన National Institute of Science, Technology and Development Studies చేపట్టిన శాస్త్రీయ అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది.శాస్త్రవేత్త డాక్టర్ శివ్ నారాయణ్ నిషాద్.

ప్రపంచ దేశాల కంటే భారత్ లో కొవిడ్ డెత్ రేట్ తక్కువగా వుండటానికి కారణం హిందువులు అనాదిగా ఆచరిస్తున్న గోత్ర వ్యవస్థే కారణమట..! ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ.. కానీ, శాస్త్రీయ గణాంకాలు ఇదే నిజమని చెబుతున్నాయి. హిందూ సంస్కృతిలో గోత్రం అనే పదాన్ని సాధారణంగా వంశానికి సమానంగా భావిస్తారు. గోత్రం అనేది పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న సాంస్కృతిక సంపద. వివాహ సమయంలో వధూ, వరుల గోత్రాలు పరిశీలించిన తర్వాతే సంబంధాలు కలుపుకుంటారు. ఒకే గోత్రం కలిగిన వారికి వివాహం చేయరు. చెప్పాలంటే ఇది హిందూ సమాజంలో వేల ఏళ్ల క్రితమే ఇదో కఠినమైన చట్టంగా మారిపోయింది.

వివాహాలను నియంత్రించే ఈ గోత్ర సంప్రదాయం వేద కాలంలోనే పురుడుపోసుకుంది. వారసత్వంగా వచ్చే వ్యాధుల ప్రమాదాన్ని శాస్త్రీయంగా తగ్గించేందుకే, నాడు మన రుషులు ఈ గోత్ర వ్యవస్థను రూపొందించారు. తద్వారా హిందువులు వివిధ రకాల మహమ్మారుల బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పొందుతున్నారు. కానీ, ఇలా చెప్పడం ఆచరణాత్మకమేనా..? గోత్ర వ్యవస్థ రోగనిరోధక శక్తిని ఇస్తుందనడం సమంజసమేనా..? అని మీరడగొచ్చు. 10వ తరగతి జీవశాస్త్రమే మీ సందేహానికి సమాధానం చెబుతుంది. ఒక్కసారి స్కూల్ డేస్ కి వెళ్లి అందులోని జెనెటిక్స్ చాప్టర్ ను ఓసారి గుర్తుచేసుకోండి.

గోత్ర వ్యవస్థ ప్రధానంగా హిందువులలో సంతానోత్పత్తిని నిరోధిస్తుంది. ఒకే గోత్రంలో లేదా మేనరిక వివాహాలు చేసుకుంటే, పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుడతారనే మాట తరుచూ వింటూనేవుంటాం. అయితే, ఇది శాస్త్రీయంగా నిరూపితం కాకపోయినా.. సంతానోత్పత్తిపై మాత్రం దీని ప్రభావం వుంటుందని వైద్య నిపుణులు చెబుతారు. అంటే, సంతానోత్పత్తి జన్యుపరమైన లోపాలకు నేరుగా కారణం కాకపోయినా.. ఇది ఒకే రకమైన హోమోజైగోసిటీ ఫ్రీక్వెన్సీని పెంచుతుంది. ఒక వ్యక్తి జన్యువులో ఒకే రకమైన యుగ్మ వికల్పాలు కలిగివుండే పరిస్థితినే హోమోజైగోసిటీ అంటారు.

మానవ శరీరంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వీటిలో 22 జతల క్రోమోజోములు ఒకేలా వుంటాయి. ఇక మిగిలిన ఒక జత లైంగిక క్రోమోజోములు. మనిషిలో వుండే ఈ 23 జతల క్రోమోజోముల్లో సగం తల్లి నుంచి.. ఇంకో సగం తండ్రి నుంచి సంక్రమిస్తాయి. క్రోమోజోముల్లో భాగమైన జన్యువులో రెండు యుగ్మవికల్పాలు ఉంటాయి. ఒక యుగ్మ వికల్పం, మరొక యుగ్మవికల్పంతో జతకలిసి జన్యువు ఏర్పడుతుంది. జన్యువులతో కూడిన క్రోమోజోముల కలయితే జైగోట్ ఏర్పడుతుంది. దీనిలో తెలుగులో సంయుక్త బీజం అంటారు. ఇదే ఆ తర్వాత పిండంగా రూపాంతరం చెందుతుంది. అయితే, ఒకే రకమైన యుగ్మవికల్పాలు కలిసినప్పుడు.. తల్లి నుంచి, తండ్రి నుంచి సంక్రమించే వికల్పాలు ఒకేలా ఉన్నప్పుడు.. పిండం ఏర్పడితే దానిని హోమోజైగోసిటీస్ అంటారు. ఇందులో జన్యు సంక్రమణ వ్యాధులకు అవకాశం ఎక్కువ. ఇది రోగ నిరోధక శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. ఒకే గోత్రానికి చెందిన వారు, రక్తసంబంధీకుు వివాహం చేసుకుంటే ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం వుంటుంది.

అందుకే, పూర్వీకులు గోత్ర సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. గోత్రాలు కలవకుండా చూసి వివాహ సంబంధాలు ఏర్పరుచుకోవడం హిందువుల్లో అనాదిగా వస్తున్న ఆచారం. అందువల్ల వారసత్వ సాంక్రమిత వ్యాధులకు అవకాశం తక్కువ. అంతేకాదు, రోగనిరోధక శక్తి కూడా బలంగా వుంటుంది. కరోనాను ఎదుర్కోవాంటే ముఖ్యంగా కావాల్సింది రోగనిరోధక శక్తి అనేది జగమెరిగిన సత్యం. దీనిని బట్టి గోత్ర వ్యవస్థ వల్లే హిందువులపై కరోనా తీవ్ర ప్రభావం చూపలేదన్నది స్పష్టమవుతుంది. ఇతర మతాల కంటే హిందువుల్లో కరోనా డెత్ రేట్ తక్కువగా వుండటానికి ఇదే కారణం. కరోనా గణాంకాలకే ఇందుకు నిదర్శనం.

గోత్ర వ్యవస్థ హిందూ సంప్రదాయంలో మాత్రమే కనిపిస్తుంది. మరే ఇతర మతాల్లో ఈ వ్యవస్థ వుండదు. అందుకే, ముస్లిం, క్రిస్టియన్ దేశాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా ముస్లిం మెజారిటీ దేశాల్లో సమిష్టి వివాహాలు ఎక్కువగా జరుగుతాయి. సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఈ నిష్పత్తి నిరంతరం పెరుగుతూనేవుంటుంది. ఆ దేశంలో జరిగే వివాహాల్లో ఎక్కువగా కజిన్స్ మధ్యే జరుగుతాయి. సౌదీ అరేబియాతో పాటు.. ఖతార్, యూఏఈ వంటి దేశాల్లో ఇలాంటి వివాహాల శాతం ఎక్కువ. ఇలాంటి సమష్టి విహాల వల్ల వారసత్వంగా సంక్రమించే వ్యాధులు పెరుగుతాయని.. మరణాల శాతం కూడా ఎక్కువేనని.. 2017లో హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ అధ్యయనం తేల్చిచెప్పింది. అంతేకాదు, సమిష్టి వివాహాలకు.. గుండె జబ్బులు, ఉబ్బసం, డిప్రెషన్, ఆస్తమా వంటి వ్యాధులతో సంబంధం వుందని కూడా నివేదిక తేల్చింది.

ఇప్పుడు కరోనా వైరస్ విషయానికి వద్దాం. గత జూన్ నెల గణాంకాలను పరిశీలిస్తే.. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలలోనే కొవిడ్ డెత్ రేట్ ఎక్కువగా వుంది. మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే.. ఫ్రాన్స్, యూకే, ఇజ్రాయిల్ వంటి దేశాల్లోని ముస్లింలలో కొవిడ్ మరణాల శాతమే ఎక్కువ. రాయిటర్స్ కథనం ప్రకారం.. ఫ్రాన్స్ దేశస్తుల కంటే.. సహారా ఆఫ్రికాలో పుట్టిన ఫ్రెంచ్ రెసిడెంట్స్ లో డెత్ రేట్ 4.5 రెట్లు అధికంగా వుంది. ఇక, ఇంగ్లాండ్ లో ముస్లింలలోనే ఎక్కువగా కరోనా మరణాలు సంభవించాయి. యూకేలోని స్థానిక క్రిస్టియన్ల కంటే ముస్లింలలో రెండు రెట్లు ఎక్కువగా చనిపోయారు. ఇక, గత నెల ఇజ్రాయిల్ ప్రకటించిన నివేదిక ప్రకారం.. ఇజ్రాయిలీలకంటే.. ఇజ్రాయిలీ అరబ్బులే మూడు రెట్లు ఎక్కువగా మరణించారు. కాగ్ ప్రింట్స్ సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం.. మస్లిం విహాల్లో 13.56 శాతం సమిష్టి వివాహాలే. ఇవి హిందువుల్లో 5.04 శాతం వుంటే, క్రిస్టియన్లలో 1.08 శాతం వున్నాయి. అయినప్పటికీ, అమెరికా, యూకే దేశాల్లో సమిష్టి వివాహాల శాతం ఎక్కువే. కొన్ని గణాంకాల ప్రకారం.. క్రిస్టియన్లలో 15 శాతం సమిష్టి వివాహాలు జరుగుతాయని తెలుస్తోంది.

ఈ గణాంకాలను బట్టి గోత్ర వ్యవస్థ లేని ముస్లిం, క్రిస్టియన్లనే కరోనా వైరస్ హిందువుల కంటే ఎక్కువగా బాధించినట్టు స్పష్టవుతోంది. హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ప్రతి వ్యక్తి మరణం బాధాకరమే. అది దేశానికి దురదృష్టకరమే. అయితే, హిందువులు గోత్ర వ్యవస్థను విస్తృతంగా పాటించకపోయివుంటే.. మహమ్మారి మరింత విజృంభించేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి మహమ్మారులను ముందే ఊహించి.. అదీ సశాస్త్రీయంగా సంప్రదాయాలను ఏర్పరిచిన రుషులు సదా చిరస్మరణీయులు.

ఏదేమైనా, కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. చేతులను తరుచూ శుభ్రం చేసుకోవడం, శానిటైజర్లు వాడటం, మాస్కుతో మాత్రమే కాలు బయటపెట్టడం, ఆరు గజాల దూరాన్ని పాటించడం వంటి.. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. అర్హులందరూ వ్యాక్సిన్లు తీసుకోవాల్సిందే. అవే మనకు ఇప్పుడు శ్రీరామరక్ష.. జైహింద్..

Leave A Reply

Please enter your comment!
Please enter your name here