ఇంటికి చేరుకున్న రాజా సింగ్.. ఎలాంటి ర్యాలీ లేకుండానే..!

0
682

గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బుధవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు. తెలంగాణ పోలీసులు అరెస్టుకు ముందు రాజా సింగ్ పై పీడీ యాక్ట్ ప్రయోగించారు. అనంతరం రాజా సింగ్ ను కోర్టులో హాజరుపరచిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించారు. దాదాపుగా 40 రోజుల పాటు చర్లపల్లి జైల్లోనే ఉన్న రాజా సింగ్ జైలు నుంచే న్యాయ పోరాటం చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని, తనపై ప్రయోగించిన పీడీ యాక్ట్ ను రద్దు చేయాలని ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్లపై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రాజా సింగ్ ను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో చర్లపల్లి జైలు అధికారులు రాజా సింగ్ ను బుధవారం రాత్రి విడుదల చేశారు. హైకోర్టు రాజాసింగ్‎కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది హైకోర్టు షరతుల నేపథ్యంలో ఎలాంటి ర్యాలీ లేకుండానే రాజా సింగ్ ఇంటికి వెళ్లిపోయారు. బీజేపీ కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. హైకోర్టు షరతులు విధించడంతో ఎలాంటి ర్యాలీ లేకుండానే రాజా సింగ్ ఇంటికి చేరుకున్నారు. రాజాసింగ్ జైలు నుంచి విడుదలయ్యే సమయంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలని సూచించింది. ప్రెస్ మీట్ లు పెట్టి ప్రసంగాలు చేయొద్దని రాజాసింగ్ కు హైకోర్టు సూచించింది.

ఎమ్మెల్యే రాజా సింగ్ విడుదలపై బీజేపీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. రాజా సింగ్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, అభిమానులు చేరుకుని టపాసులు కాల్చారు. నృత్యాలు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.