More

  నెట్ ఫ్లిక్స్ ఫ్రీ అంటూ ప్లే స్టోర్ లో ఫేక్ యాప్.. ఇన్ స్టాల్ చేస్తే అంతే సంగతులు

  నెట్ ఫ్లిక్స్. ప్రపంచంలోనే ప్రస్తుతానికిది నెం1 ఓటీటీ ప్లాట్ ఫాం. టీవీ షోలతో పాటు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇలా ఒకటేంటి వినోదమంతా ఈ నెట్‌ఫ్లిక్స్‌లోనే నిక్షిప్తమై ఉంటుంది. అంతటి వినోదాన్ని వీక్షించాలంటే మెంబర్‌షిప్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే.. అమెజాన్ ప్రైమ్, ఆహా మాదిరిగా నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ అంత తక్కువ కాదు… వాటికి సంవత్సారినికి ఇవ్వాల్సింది ఇక్కడ దీనికి నెలకే ఇవ్వాల్సి పే చేయాల్సి ఉంటుంది. అందుకే నెట్ ఫ్లిక్స్ లో చూడదగ్గ కంటెంట్ ఉన్నా.. చూడాలనుకున్నా కొందరు ఆగిపోతుంటారు. అయితే ఆ మెంబర్‌షిప్‌తో పనిలేకుండా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీ అని ప్రకటిస్తే.. దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు సగటు ఆశాజీవులు.. ఇక్కడే కొందరు సైబర్ నేరగాళ్లకు ఆ బలహీనతే బలమవుతోంది.

  టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషికి వెసులుబాట్లు ఎన్ని వస్తాయో.. సమస్యలూ అన్నే వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు మన కష్టార్జితం దాచుకోవాలంటే ఇనుపపెట్టెలుండేవి.. ఇప్పుడు వాటి స్థానంలోకి పాస్ వర్డ్ లు, ఓటీపీలు వచ్చేశాయి. అంటే భద్రత అనేది జఠిలమై కూర్చున్నది. సదా అప్పమత్తత అనే ఇప్పుడు అవసరం. అందుకే ఎప్పటికప్పుడు టెక్ నిపుణులు చెప్పేమాటలు, విలువైన సూచనలు మనం పాటిస్తూ ఉండాలి. తాజాగా మరో అటువంటి ప్రమాదమే వచ్చిపడింది కనుక ఇప్పటివరకు ఈ ఉపోద్ఘాతము చెప్పడం జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే…

  నెట్ ఫ్లిక్స్. ప్రపంచంలోనే ప్రస్తుతానికిది నెం1 ఓటీటీ ప్లాట్ ఫాం. టీవీ షోలతో పాటు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇలా ఒకటేంటి వినోదమంతా ఈ నెట్‌ఫ్లిక్స్‌లోనే నిక్షిప్తమై ఉంటుంది. అంతటి వినోదాన్ని వీక్షించాలంటే మెంబర్‌షిప్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే.. అమెజాన్ ప్రైమ్, ఆహా మాదిరిగా నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ అంత తక్కువ కాదు… వాటికి సంవత్సారినికి ఇవ్వాల్సింది ఇక్కడ దీనికి నెలకే ఇవ్వాల్సి పే చేయాల్సి ఉంటుంది. అందుకే నెట్ ఫ్లిక్స్ లో చూడదగ్గ కంటెంట్ ఉన్నా.. చూడాలనుకున్నా కొందరు ఆగిపోతుంటారు.

  అయితే ఆ మెంబర్‌షిప్‌తో పనిలేకుండా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీ అని ప్రకటిస్తే.. దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు సగటు ఆశాజీవులు.. ఇక్కడే కొందరు సైబర్ నేరగాళ్లకు ఆ బలహీనతే బలమవుతోంది. ఫేక్ యాప్స్‌ ను నిరోధించేందుకు గూగుల్ ఎంత ప్రయత్నిస్తున్నా.. అవి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌ను వేదికగా చేసుకుని నెటిజన్లను బురిడీ కొట్టించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాయి.

  తాజాగా.. అలాంటి ఫేక్ యాప్ ఒకటి గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్నట్లు సైబర్ సెక్యురిటీ రీసెర్చర్స్ గుర్తించారు. ఆండ్రాయిడ్ సర్వీస్ యాప్ ‘ఫ్లిక్స్‌ ఆన్‌లైన్’ పేరుతో గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న ఈ ఫేక్ యాప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్ యూజర్లే లక్ష్యంగా జనాలను మాయబుచ్చుతున్నట్లు తేల్చారు. ఈ ‘ఫ్లిక్స్‌ ఆన్‌లైన్’ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్‌ను ఉచితంగా పొందొచ్చని ఆండ్రాయిడ్ యూజర్లను ఈ ఫేక్ యాప్ బ్యాచ్ బురిడీ కొట్టిస్తున్నారు. ఇన్‌స్టాల్ చేసుకున్న వారి వాట్సాప్ డేటాను తస్కరిస్తున్నారు. అంతేకాదు.. వాట్సాప్ నోటిఫికేషన్లను మోనిటర్ చేస్తున్నారు. ఎవరైనా మీకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే వారికి ఆటోమేటిక్‌గా మీకు తెలియకుండానే రిప్లై ఇస్తున్నారు.


  అలా ఇన్‌కమింగ్ మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం ద్వారా మాల్‌వేర్‌ను హ్యాకర్లు వాట్సాప్‌లోకి పంపుతున్నారని సైబర్ సెక్యురిటీ రీసెర్చర్స్ తెలిపారు. అలా మాల్‌వేర్‌ను పంపి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, వాట్సప్ అకౌంట్‌కు సంబంధించిన క్రెడెన్షియల్స్‌ను తస్కరించడం, యూజర్స్ డేటాను దొంగిలించడం చేస్తున్నారని తేల్చారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పొరపాటున ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తే.. మాల్‌వేర్ సర్వీస్ రిక్వెస్ట్‌ లను పంపిస్తుందది. Overlay, Battery Optimization Ignore, and Notificationలకు పర్మిషన్ అడుగుతుంది.

  తెలియక పర్మిషన్స్ అడుగుతుంది కదా అని యాక్సెస్ ఇచ్చారా.. మీ ఫోన్‌లోకి మాల్‌వేర్ పూర్తి స్థాయిలో ప్రవేశిస్తుంది. మీకొచ్చే వాట్సాప్ మెసేజ్‌లకు ఆటోమేటిక్‌గా రిప్లైలు వెళ్లిపోతాయి. మీ వాట్సప్ నెంబర్ నుంచి తప్పుడు సమాచారం గ్రూప్స్‌ లో, వ్యక్తిగత నంబర్లకు వెళ్లే అవకాశముంది. అంతేకాదు, మీ వాట్సప్ సంభాషణలు, వ్యక్తిగత డేటా చోరీకి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.

  రీసెర్చర్స్ ఆ ఫేక్ యాప్ విషయమై గూగుల్‌కు సమాచారమందించారు. దీంతో.. అప్రమత్తమైన గూగుల్.. ప్లే స్టోర్ నుంచి ఆ యాప్‌ను తొలగించింది. సో ఆల్వేజ్ బీ అలర్ట్.

  Related Stories