గొల్లపూడి మారుతీరావు సతీమణి క‌న్నుమూత‌.. రామ‌కోటి రాస్తూనే ఉండేవారట

0
1446

దివంగ‌త న‌టుడు, ర‌చ‌యిత గొల్ల‌పూడి మారుతీరావు భార్య శివ‌కామ‌సుంద‌రి తుది శ్వాస విడిచారు. చెన్నైలో కుమారుడి నివాసంలో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఆమె పరమపదించారు. వయోభారంతో పాటు పలు ఆరోగ్య సమస్యలతో శివకామసుందరి మృతి చెందిన‌ట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వరంగల్ లోని హన్మకొండలో జ‌న్మించిన‌ శివకామసుందరి 1961లో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన గొల్ల‌పూడి మారుతీరావును వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు కొడుకులు కాగా ఐదుగురు మ‌న‌వ‌ళ్లు ఉన్నారు. 2019లో అనారోగ్యంతో గొల్ల‌పూడి మారుతీరావు క‌న్నుమూశారు. అప్ప‌టి నుంచి త‌న కుమారుడు సుబ్బారావు నివాసంలో ఉంటున్నారు. ఆమెకు భక్తి భావం చాలా ఎక్కువ. రామ‌భ‌క్తురాలైన ఆమె మూడున్న‌ర కోట్ల రామ‌కోటి రాసిన‌ట్లు కుటుంబీలు తెలిపారు. ఆమె వ‌య‌స్సు 81 సంవ‌త్స‌రాలు. ఆమె మృతి ప‌ట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

ఆమె కుటుంబ సభ్యులు ఆమె భౌతికకాయానికి కన్నమ్మపేట శ్మశానవాటికలో శుక్రవారమే అంత్యక్రియలను నిర్వహించారు. హన్మకొండలో జన్మించిన శివకామసుందరికి, మారుతీరావుతో 1961లో వివాహమైంది. గొల్లపూడి మారుతీ రావు, శివకామసుందరి దంపతలుకు ఇద్దరు కుమారులు కాగా.. ఐదుగురు మనవళ్లు ఉన్నారు. ఒక కుమారుడు వైజాగ్ ప్రమాదంలో మరణించారు.