ఇవి ఏంటో తెలుసా..?

0
984

రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం లో భారీగా బంగారం పట్టుబ‌డింది. దుబాయ్ నుంచి హైద‌రాబాద్ కు వ‌స్తున్న న‌లుగురు సూడాన్ వాసుల‌ను ఎయిర్ పోర్ట్ లో ఉన్న క‌స్టమ్స్ అధికారులు ప‌ట్టుకున్నారు. వీరి ద‌గ్గ‌ర నుంచి భారీగా బంగారాన్ని ప‌ట్టుకున్నారు. వీరి ద‌గ్గ‌ర నుంచి రూ. 3.60 కోట్ల విలు చేసే 7.3 కిలో గ్రాముల బంగారాన్ని క‌స్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం కొంత భాగాన్ని పేస్ట్ రూపంలో కి మార్చి తీసుకువ‌చ్చారు. అలాగే మ‌రి కొంత భాగాన్ని గోల్డ్ బార్స్ గా మార్చి తీసుకువ‌చ్చారు. ఎయిర్ పోర్ట్ లో ఉన్న కస్టమ్స్ అధికారులు బంగారాన్ని క‌నిపెట్ట‌డంతో ఈ న‌లుగురిని అదుపులోకి తీసుకున్నారు.

కస్టమ్స్ శాఖ నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ స్మగ్లర్లు తమ పురీషనాళంలో పెద్ద మొత్తంలో బంగారాన్ని దాచారు. ఈ నలుగురు స్మగ్లర్ల నుంచి రికవరీ చేసిన బంగారం బరువు 7.3 కిలోలు, మార్కెట్‌లో దాదాపు రూ. 3.6 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నలుగురు సూడాన్ జాతీయులు దుబాయ్ నుండి ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. వీరిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అనుమానంతో కస్టమ్స్ విభాగం వారందరినీ తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. సోదాల్లో ఇలాంటి అక్రమ రవాణా బయటపడడంతో అధికారులు సైతం ఉలిక్కిపడ్డారు. మలద్వారంలో బంగారం దాచుకున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం ప్రస్తుతం కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఆధీనంలో ఉంది. ఈ విషయంలో తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

స్మగ్లర్లు ఇలాంటి దారిలో బంగారాన్ని తీసుకుని రావడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది జూలైలో చెన్నై విమానాశ్రయంలో ఓ స్మగ్లర్ పట్టుబడ్డాడు. దాదాపు 810 గ్రాముల బంగారాన్ని పురీషనాళంలో దాచుకున్నాడు. ఈ బంగారాన్ని పేస్ట్‌ చేసి నాలుగు కట్టలుగా చేసి దాచి ఉంచాడు. దుబాయ్‌ నుంచి భారత్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రికవరీ చేసిన బంగారం రూ.40 లక్షలకుపైగా ఉంటుందని అంచనా. కొద్ది నెలల క్రితమే విమానంలో దుబాయ్‌-హైదరాబాద్‌ మీదుగా వస్తున్న మరో స్మగ్లర్‌ పట్టుబడ్డాడు. స్మగ్లర్ ఆరు కిలోల బంగారాన్ని రీచార్జిబుల్ లాంతరులో అతికించాడు. బంగారం స్మగ్లింగ్ చేస్తున్న సూడాన్‌కు చెందిన ఓ మహిళను విమానాశ్రయ అధికారులు అక్టోబర్‌లోనే అరెస్టు చేశారు. ఆమె తన లోదుస్తులు, హ్యాండ్‌బ్యాగ్‌లో 1200 గ్రాముల బంగారు పేస్ట్‌ను దాచింది.