More

    పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత అంటూ కథనాలు

    పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ శుక్రవారం కన్నుమూశారని కొన్ని పాకిస్థాన్ మీడియాలు చెబుతున్నాయి. అయితే ఈ వార్తను కొన్ని మీడియా సంస్థలు ఖండిస్తున్నాయి. దుబాయ్‌లోని అమెరికన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనరల్ ముషారఫ్ తుది శ్వాస విడిచారని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేయగా.. ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని చెప్తున్నాయి.

    పాకిస్థాన్ రాజకీయ చరిత్రలో వివాదాస్పద అధ్యక్షుడి కేటగిరీలో ముషారఫ్ ఉన్నారు. ఆయన 2001 నుంచి 2008 వరకు పాకిస్థాన్ అధ్యక్షునిగా ఉన్నారు. ఆ పదవి నుండి దిగిపోకుండా ఉండడానికి పడరాని పాట్లు పడ్డాడు ముషారఫ్. అభిశంసనను తప్పించుకోవడం కోసం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించిన ముషారఫ్ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా పని చేశారు. 1999లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ఫెడరల్ ప్రభుత్వాన్ని కూల్చేసి సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముషారఫ్‌ను మిలిటరీ చీఫ్‌గా నవాజ్ షరీఫ్ చేయగా.. ఆ తర్వాత ముషారఫ్ నవాజ్ షరీఫ్ పై ఎన్నో కుట్రలు పన్నాడు. ఇక ఎన్నో స్కామ్ లలో కూడా ముషారఫ్ పేరు వినిపించింది. అరెస్టులకు భయపడి పాకిస్థాన్ ను విడిచి ముషారఫ్ పారిపోయారు. జనరల్ ముషారఫ్ 2016 నుంచి దుబాయ్‌లో ఉంటున్నారు. ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో అమెరికన్ ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స నిర్వహిస్తూ ఉండగా శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది. ఈ వార్తల్లో నిజం లేదని మరికొన్ని ప్రసార మాధ్యమాలు చెప్తున్నాయి. ముషారఫ్ చనిపోయాడా.. బ్రతికి ఉన్నాడా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

    Trending Stories

    Related Stories