Uncategorized

వరద ముప్పు పొంచి ఉంది: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

ఆంధ్రప్రదేశ్‌ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. భారీవర్షాలతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. అన్ని జిల్లాల్లోనూ కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశామని.. అత్యవసర సాయం, సమాచారం కోసం 1070, 18004250101, 08632377118 నంబర్లను సంప్రదించాలని ఇప్పటికే సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

తాజాగా గోదావరికి వరద ఉధృతి పెరుగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 5,91,269 క్యూసెక్కులు ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోందని అధికారులు తెలిపారు. వరద ముంపు ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది విపత్తుల సంస్థ. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని విపత్తుల సంస్థ అధికారులు తెలిపారు. ముందస్తుగా అత్యవసర సహాయక చర్యలకోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరదనీరు దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని సూచించారు.

Related Articles

Back to top button