ఆత్మహత్య చేసుకోవాలని గోదావరి నదిలోకి దూకిన సోమేశ్వరరావు.. ఆ తర్వాత

0
892

కోనసీమలో లంక గ్రామమైన మండపల్లి కి చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని గోదావరి నదిలో దూకినా మృత్యుంజయుడయ్యాడు. కోనసీమకు చెందిన సోమేశ్వరరావుకు జీవితం మీద విరక్తి కలిగింది. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. దీంతో సిద్ధాంతం బ్రిడ్జిపై నుంచి గోదాట్లో దూకేశాడు. అయితే వరదనీటిలో పడ్డాక.. మళ్ళీ బతికేయాలన్న ఆలోచన వచ్చింది. అలా వరదల్లో కొట్టుకొచ్చిన ఓ చెట్టు బెరడు పట్టుకొని, 25 కిలోమీటర్లు నీటిపై వెళ్ళిపోయాడు. కనకాయలంక వరద మధ్యలో నుంచి దగ్గర కేకలు వినిపించడంతో.. నీటిలో చిక్కుకుపోయిన సోమేశ్వరరావుని గుర్తించారు నరసాపురం డిఎస్పీ వీరాంజనేయరెడ్డి. బోటులో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని పంపించి, బాధితుడిని ఒడ్డుకి చేర్చారు. కుటుంబ సభ్యులే మోసం చేశారని, అందుకే ఆత్మహత్య కు ప్రయత్నించానని పోలీసులకు తెలిపాడు సోమేశ్వర రావు. భూమి మీద నూకలు ఉండాలే కానీ.. ఎలాంటి అద్భుతమైనా జరగొచ్చు అన్నది సోమేశ్వరరావు జీవితమే ఒక ఉదాహరణ.