National

అధికారంలోకి రాగానే గోవాలోని క్యాసినోలన్నింటినీ మూసివేస్తాం..!

రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికలను శివసేన పార్టీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ గెలవడానికి ఏయే వాగ్ధానాలను చేస్తే బెటరో వాటిని ప్రజలలోకి తీసుకుని వెళ్లాలని శివసేన భావిస్తోంది. గోవా ఎన్నికల్లో శివసేన 22 నుండి 25 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని అనుకుంటూ ఉంది. తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వస్తే గోవా రాష్ట్రంలో క్యాసినోలను మూసివేస్తామని హామీ ఇచ్చారు. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికలలో అనేక చిన్న పార్టీలు ఎన్నికల రేసులో నిలిచాయి. ఆప్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా గోవాలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఆ పార్టీలపై కూడా సంజయ్ రౌత్ కామెంట్లు చేశారు. “తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా గోవాలో ఎన్నికలలో నిలుస్తోందని విన్నాను. ఢిల్లీ మరియు పశ్చిమ బెంగాల్ నుండి రాజకీయ పార్టీలు గోవాలో పోటీ చేస్తున్నాయి. చాలా మంది నాయకులు పార్టీలు మారుతున్నారు.” అని అన్నారు. వీటన్నింటినీ తాము నిశితంగా గమనిస్తూ ఉన్నామని సంజయ్ రౌత్ తెలిపారు. గోవాలో శివసేనకు ఎంతో బలముందని తాము నమ్ముతున్నామని సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు. తాము వచ్చే గోవా ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిస్తామని అన్నారు. గోవాతో శివసేనకు ఎమోషనల్ గానూ మరియు సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని అన్నారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ జాతీయ రాజకీయాలలో తన ఆధిపత్యాన్ని తిరిగి పొందడానికి యుపిఎను శరద్ పవార్ నాయకత్వం వహించాలని సూచించారు. యుపిఎకు అన్ని ప్రాంతీయ పార్టీల పునర్నిర్మాణం మరియు మద్దతు అవసరమని ఆయన అన్నారు.

Related Articles

Back to top button