National

జ్ఞానవాపి వివాదంపై కోర్టులో విచారణ.. వాయిదా..!

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జ్ఞానవాపి మసీదు కేసు విచారణను వారాణాసి జిల్లా కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

కాశీ విశ్వనాథ్‌- జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో శిృంగార్ గౌరి కాంప్లెక్స్‌లోని దేవతామూర్తులకు నిత్య పూజలకు అనుమతి ఇవ్వడంతోపాటు శివలింగాన్ని సంబంధించిన సర్వే కొనసాగించాలంటూ హిందూ వర్గం నుంచి రెండు పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై అంజుమన్‌ ఇంతేజామియా మసీదు కమిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేసు మెయింటెనబుల్‌గా లేదని చెబుతూ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ 7 రూల్ 11 ప్రకారం హిందువుల తరపు పిటిషన్‌ను కొట్టివేయాలని మసీదు కమిటీ తరఫు న్యాయవాది అభయ్ నాథ్ యాదవ్‌ వాదనలు వినిపించారు. 1991 ప్రార్థనాస్థలాల చట్టం ప్రకారం జ్ఞానవాపి మసీదుపై దాఖలైన పిటిషన్లను కొట్టేయాలని కోరారు. ప్రజల మనోభావాలను దెబ్బతిసేందుకే శివలింగం పేరుతో పుకార్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన విచారణ దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. విచారణ సందర్భంగా పిటిషనర్లు, లాయర్లు, ప్రతివాదులను మాత్రమే కోర్టు లోపలికి అనుమతించారు. రెండురోజులపాటు ఇరుపక్షాల వాదనలు విన్న వారణాసి జిల్లా జడ్జి అజయ్‌కృష్ణ విశ్వేశ్‌.. విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

అయితే ఇప్పటికే వీడియో సర్వేపై అభ్యంతరాలు దాఖలు చేసేందుకు హిందూ, ముస్లిం పక్షాలకు కోర్ట్ వారం రోజుల గడువు ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈ రోజు జరిగిన వాదనలపై హిందుపక్షాన వాదిస్తున్న విష్ణు జైన్ స్పందించారు. ముస్లిం పక్షం మా పిటిషన్ లోని కొన్ని పేరాగ్రాఫ్ లను చదవి.. ఈ పిటిషన్ ను విచారించడం సాధ్యం కాదని చెప్పడానికి ప్రయత్నించిందని.. అయితే దీనికి మేం ఒప్పుకోలేదని అన్నారు. నేటితో వాదనలు పూర్తి కాలేదని.. సోమవారం మధ్యాహ్నం 2 గంటల తరువాత వాదనలు కోనసాగుతాయని ఆయన అన్నారు.

మసీదు వెలుపల పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి తమకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఐదుగురు మహిళలు పిటిషన్ దాఖలు చేయడంతో వారణాసి సివిల్ కోర్ట్ వీడియో సర్వేకు ఆదేశించింది. ఈ సర్వేలో మసీదులోని వాజూఖానాలోని కొలనులో శివలింగం బయటపడినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే వీడియో సర్వేను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన సుప్రీం కోర్ట్ వారణాసి జిల్లా కోర్టుకు కేసును బదిలీ చేసింది. శివలింగ ఆకారం బయటపడిన ప్రదేశానికి రక్షణ కల్పించాలని.. ఇదే విధంగా ముస్లిం ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

five − four =

Back to top button