భారత యువతిని పెళ్లి చేసుకున్న గ్లెన్ మాక్స్‌వెల్

0
1063

గ్లెన్ మాక్స్‌వెల్.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశంలో ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నాడు మాక్సీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతని ప్రదర్శన కారణంగా భారతదేశంలో భారీ పాపులారిటీని పొందాడు. ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్ రౌండర్ వ్యక్తిగత జీవితంలో భారత మహిళ ఉంది. 33 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వినీ రామన్‌ ను మాక్స్ వెల్ పెళ్లి చేసుకున్నాడు. భారత సంతతికి చెందిన వినీ రామన్‌ను శనివారం పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన విషయాన్ని మ్యాక్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. రింగులు మార్చుకున్న ఫోటోను షేర్‌ చేస్తూ.. ”లవ్‌ అనే పదాన్ని ఈరోజుతో పూర్తి చేశాను.. ఒక పెద్ద ఘట్టం ముగిసింది.. కొత్త జీవితం ఆరంభం” అంటూ చెప్పుకొచ్చాడు. మ్యాక్సీ గర్ల్‌ఫ్రెండ్‌ వినీ రామన్‌ కూడా ఇన్‌స్టాలో ”18.03.2022.. జీవితంలో మరిచిపోలేని రోజు. ఇక్కడి నుంచి మా కొత్త జీవితం ప్రారంభం కానుంది.” అని రాసుకొచ్చింది.

తమిళంలో వీరి పెళ్లి కార్డు లీక్ కావడంతో గత కొన్ని రోజులుగా వీరి పెళ్లి గురించిన సందడి సోషల్ మీడియాలో నెలకొంది. నూతన వధూవరులు తమ పెళ్లి ఫోటోతో సోషల్ మీడియాలో తామిక భార్యాభర్తలమనే ప్రకటన చేశారు. వీరిద్దరికీ నాలుగేళ్లుగా పరిచయం ఉంది. ఫిబ్రవరి 2020లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుక కోసం గ్లెన్ భారతీయ వస్త్రాలను కూడా ధరించాడు. విని రామన్ మెల్‌బోర్న్‌లో ఫార్మసిస్ట్. ఆమె ఆ నగరంలో నివసిస్తున్న తమిళ కుటుంబానికి చెందినది. వినీ రామన్‌ స్వస్థలం తమిళనాడు కావడంతో తమిళ భాషలో పెళ్లి పత్రిక లీక్‌ కావడం అందరిని ఆకట్టుకుంది. భారతీయ సంప్రదాయం పట్ల మ్యాక్స్‌వెల్‌కున్న అభిమానాన్ని అందరూ మెచ్చుకున్నారు.

RCB star Glenn Maxwell marries girlfriend Vini Raman ahead of IPL 2022 -  Sports News

మ్యాక్స్‌వెల్‌ వివాహం సందర్బాన్ని పురస్కరించుకొని ట్విటర్‌ వేదికగా ఆర్‌సీబీ శుభాకాంక్షలు తెలిపింది. మ్యాక్సీ, వినీ రామన్‌ పెళ్లిపై ఆర్సీబీ ఫ్యామిలీ సంతోషంగా ఉంది. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వేళ ఈ ఇద్దరికి ఆల్‌ ది బెస్ట్‌ అని పోస్టు పెట్టింది. పలువురు క్రికెట్ ప్రముఖులు మాక్స్ వెల్ కు శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు. మాక్సీ ఐపీఎల్ లో ఎలా ఆడుతాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. IPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు. విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్‌లతో పాటు ఫ్రాంచైజీ రిటైన్ చేసిన ఆటగాళ్లలో అతను ఒకడు. RCB మాక్స్‌వెల్‌ను రూ. 11 కోట్లకు అట్టిపెట్టుకుంది.