ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మరో సంచలనం నమోదైంది. తాజాగా ఓ క్రికెటర్ 400 పరుగులు బాదాడు. గ్లామోర్గాన్‌కు చెందిన శామ్ నార్త్ఈస్ట్.. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 410 సాధించి అజేయంగా నిలిచాడు. 32 ఏళ్ల శామ్ సిక్సర్‌తో 400 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇది ఆల్‌టైమ్ 9వ స్కోరు. శామ్ క్వాడ్రపుల్ సెంచరీతో గ్లామోర్గాన్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 795 పరుగులు చేసింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో 400కు పైగా స్కోరు సాధించిన 11వ వ్యక్తిగా శామ్ రికార్డులకెక్కాడు. 21వ శతాబ్దంలోనే ఇది అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇంగ్లండ్ గడ్డపై మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా ఇదే. 1994లో వార్విక్షైర్ తరపున విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా డర్హమ్‌లో 501 పరుగులు చేసి రికార్డునెలకొల్పాడు. లారా, ఆస్ట్రేలియాకు చెందిన బిల్ పాన్స్పోర్ట్ రెండుసార్లు 400 మార్క్ ఘనత సాధించారు. ఇంగ్లండ్‌తో జరిగిన అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లోనూ లారా అజేయంగా 400 పరుగులు చేశాడు.
శామ్ నార్త్ఈస్ట్ శనివారం చరిత్ర సృష్టించాడు. అతను బ్రియాన్ లారా తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో 400 పరుగుల మార్క్‌ను దాటిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 450 బంతుల్లో అజేయంగా 410 పరుగులు చేశాడు. గ్లామోర్గాన్ 795/5 వద్ద డిక్లేర్ చేయడంతో నార్త్ఈస్ట్ 45 ఫోర్లు మరియు మూడు సిక్సర్లతో అతని మొదటి ఇన్నింగ్స్‌లో అజేయంగా 410 పరుగులు చేశాడు. అతని జట్టు 6.1 ఓవర్లలో 9/2 వద్ద ఇబ్బందుల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు కోలిన్ ఇంగ్రామ్‌తో కలిసి 306 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నిలబెట్టాడు.