More

    జిల్ జిల్ జి’గిల్’… ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద..!

    భారత ఓపెనర్ శుభ్ మాన్ గిల్ హైదరాబాద్ వన్డేలో డబుల్ సెంచరీ బాదాడు. 23 ఏళ్ల రైట్ హ్యాండర్ 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు. గిల్ స్కోరులో 19 ఫోర్లు, 9 సిక్సులున్నాయి. గిల్ డబుల్ సెంచరీ సాయంతో ఈ మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 34, సూర్యకుమార్ యాదవ్ 31, హార్దిక్ పాండ్యా 28 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో డారిల్ మిచెల్ 2, షిప్లే 2, లాకీ ఫెర్గుసన్ 1, బ్లెయిర్ టిక్నెర్ 1, మిచెల్ శాంట్నర్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో 106 పరుగుల వద్ద టిక్నర్ బౌలింగ్ లో కొట్టిన ఫోర్ తో గిల్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 1000 పరుగులు పూర్తిచేసుకున్నాడు. 19 ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగులు పూర్తిచేసుకున్న ప్లేయర్ గా గిల్ రికార్డ్ నెలకొల్పాడు.

    అతిచిన్న వయసులో (23 ఏళ్లు) డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్ మెన్ గా గిల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు ఇషాన్ కిషన్ (24 ఏళ్లు) పేరిట ఉండేది. ఇషాన్ కంటే ముందు రోహిత్ 26 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ కొట్టాడు.న్యూజిలాండ్ పై అత్యధిక పరుగులు చేసిన రికార్డు సైతం గిల్ ఖాతాలో చేరింది. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉండేది. 1999 లో సచిన్ న్యూజిలాండ్ పై 186 పరుగులు చేశాడు. హేడెన్ హామిల్టన్ (181), కల్లాఘన్ సెంచూరియన్(169) లిస్టులో ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఉప్పల్ స్టేడియంలో తొలి డబుల్ సెంచరీ చేసిన ఘనత కూడా గిల్ కే సొంతమైంది. భారత్ తరుపున 5వ డబుల్ సెంచరీ నమోదయింది. తొలి డబుల్ సెంచరీ సచిన్ టెండూల్కర్ చేశాడు. ఆ తర్వాత సెహ్వాగ్, రోహిత్ శర్మ మూడు సెంచరీలు, కొద్దిరోజుల కిందట ఇషాన్ కిషన్.. ఇప్పుడు గిల్ డబుల్ సెంచరీ క్లబ్ లోకి చేరుకున్నాడు.

    Trending Stories

    Related Stories