విశాఖ: జివింఎంసి గాజువాక జోనల్ కమిషనర్ పొందూరు సింహచలానికి చుక్కెదురైంది. 72వ వార్డులో యూజర్ చార్జీలు వసూళ్ళపై జోనల్ కమిషనర్‌ను స్థానికులు నిలదీశారు. చెత్తపన్ను వసూళ్ళు చేయడంలో ఆసక్తి చూసించే అధికారులు చెత్త సేకరణలో ఎందుకు ఆలసత్వం చూపిస్తున్నారని నిలదీశారు. ప్రశ్నించిన వారితో జివింఎంసి జోనల్ కమిషనర్ సింహచలం వాగ్విదానికి దిగారు. యూజర్ చార్జీలు కట్టపోతే అపార్టమెంట్ సీజ్ చేస్తాం, చర్యలు తీసుకుంటాం అని జోనల్ కమిషనర్ హెచ్చరించడంపై అపార్టుమెంట్ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జోనల్ కమిషనర్ పొందూరు సింహచలం వ్యవహారశైలిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.