అనకాపల్లి జిల్లాలో అమోనియా గ్యాస్ లీక్‌ కలకలం

0
869

అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీక్ ఘటన ప్రజలను టెన్షన్ పెడుతోంది. అచ్చుతాపురం SEZ లో అమోనియా లీక్‌ అయింది. బ్రాండిక్స్‌ ఎస్‌ఈజెడ్‌లో గ్యాస్ లీకైంది. క్వాంటమ్‌ కంపెనీలో పనిచేసే పలువురు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. అమ్మోనియా లీక్ అవ్వడంతో భయపడి అక్కడి క్వాంటమ్ సీడ్ కంపెనీ ఉద్యోగులు పరుగులు తీశారు. ఉద్యోగులకు వాంతులు అయ్యాయి. మహిళలకు బ్రాండిక్స్ ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. మరికొందరు కూడా అస్వస్థతకు గురయ్యారని వారిని ఆస్పత్రులకు తరలించామంటున్నారు. అయితే ఈ వాయువు ఎక్కడినుంచి వస్తుందో తెలియలేదని యాజమాన్యం చెబుతోంది. పక్కనే ఉన్న కంపెనీ నుంచి అమ్మోనియో గ్యాస్ లీక్ అయ్యిందని చెబుతున్నారు. పోరస్‌ కంపెనీ నుంచి అమోనియా వాయువు లీకైందని నిర్ధారణ అయిందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెల్లడించారు.