More

    వైజాగ్ లో మరో గ్యాస్ లీక్ కలకలం.. పంపు హౌస్ వాల్వ్ ఓపెన్ చేస్తుండగా..!

    విశాఖపట్టణం లో మరో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. పరవాడ ఫార్మాసిటీలో గ్యాస్ లీక్ అయింది. వ్యర్థ జలాల పంప్‌హౌస్‌లో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. బాధితులను పాయకరావుపేటకు చెందిన మణికంఠ (25), దుర్గాప్రసాద్ (25)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    వ్యర్థజలాల పంప్‌హౌస్‌లో గ్యాస్‌ లీకవ్వడంతో ఈ ఇద్దరు ఒప్పంద కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. మణికంఠ, దుర్గాప్రసాద్‌లు వ్యర్ధ జలాల పంపు హౌస్ వాల్వ్ ఓపెన్ చేస్తుండగా ఒక్కసారిగా విషవాయువులు లీక్ అయ్యింది. విషవాయువులు లీక్ అవడంతో ఆ ఇద్దరు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన ఇద్దరులో ఒకరు తుని, మరొకరు పాయకరావుపేట సీతారాంపురం ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు.

    గతేడాది మేలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో పదిమంది వరకు ప్రాణాలు కోల్పోగా, చుట్టుపక్కల ఉన్న వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఈ ఏడాది సెప్టెంబరులో హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌ సంస్థలో గ్యాస్ లీకైంది. దీంతో వందల సంఖ్యలో కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.

    Vizag gas leak: Hazardous industries in Kerala told to strengthen vigil-  The New Indian Express

    Trending Stories

    Related Stories