అనంతపురంలో గ్యాస్ సిలీండర్ పేలుడు.. నలుగురు మృతి

0
708

అనంతపురం జిల్లాలో శనివారం తెల్లవారు జామున ఓ ఇంట్లో గ్యాస్ సిలీండర్ పేలి నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ పేలుడు దాటికి ఇంటిపైకప్పు కూలిపడటంతో ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. శెట్టూరు మండలం ములకలేడులో కుటుంబ సభ్యులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా సిలీండర్ పేలింది. ఈ పేలుడు దాటికి ఇంటి పైకప్పు కూడా కూలడంతో కుటుంబ సభ్యులంతా శిథిలాల కింద చిక్కుకు పోయారు. సిలీండర్ పేలుడుతో భారీ శబ్దం రావడంతో గ్రామస్తులు ఘటన స్థలికి చేరుకున్నారు. ఇంటిపైకప్పు కూలి ఉండటంతో పాటు దట్టమైన పొగ కమ్ముకొని ఉంది. పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన జైనుబి(60), దాదు(35), షర్ఫున(30), ఫిర్దోజ్(6) మృతిచెందారు. మరో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకొని తీవ్రగా గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.