More

    చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గరికపాటి

    ద‌స‌రా వేడుక‌ల సంద‌ర్భంగా హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ కుమార్తె విజ‌య‌ల‌క్ష్మి ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌లో గురువారం అల‌య్ బ‌ల‌య్ వేడుక‌లు ఘ‌నంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుక‌ల‌కు మెగాస్టార్ చిరంజీవి హాజ‌య్యారు. గురువారం సాయంత్రం దాకా సాగ‌నున్న ఈ వేడుక‌ల‌కు ఏపీ, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్లు బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌, త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్, హ‌ర్యానా సీఎం మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌తో పాటు కిష‌న్ రెడ్డి స‌హా ప‌లువురు కేంద్ర మంత్రులు కూడా హాజ‌రుకానున్నారు. అంతేకాకుండా పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.

    ఈ సందర్భంగా గరికపాటి నరసింహరావుకి కోపం వచ్చింది. అలయ్‌ బలయ్‌లో ఆయన మాట్లాడుతున్న సమయంలో అభిమానులతో మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు దిగేందుకు వెళ్లారు. అంతా చిరంజీవినే గమనించడం మొదలు పెట్టారు. దీంతో గరికపాటి స్పందిస్తూ.. చిరంజీవి గారూ.. మీ ఫోటో సెషన్ ఆపేయండి.. లేదంటే నాకు సెలవియ్యండని అన్నారు. దీంతో అంతా గరికపాటి వైపు తిరిగారు. గరికపాటి చెప్పిన తర్వాత చిరంజీవి ఆయన దగ్గరకు వచ్చి మరీ పలుకరించారు. చాలాసేపు ఆయన పక్కనే కూర్చుని మాట్లాడారు. ఇదే సభలో అంతకు ముందు గరికపాటిని ప్రశంసించారు చిరంజీవి. ఇదే సభలో అంతకు ముందు గరికపాటిని ప్రశంసించారు చిరంజీవి. హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీ ఆధ్వర్యంలో ఈ అలయ్‌ బలయ్‌ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్‌ చిరంజీవి డోలు వాయిస్తూ హాజరయ్యారు. మెడలో డోలు వేసుకుని.. ఉత్సాహంగా డోలు వాయించిన ఆయన, స్టెప్పులు కూడా వేశారు.

    Trending Stories

    Related Stories