భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో 150 కిలోల గంజాయి పట్టుబడింది. శనివారం భద్రాచలంలో ఆబ్కారీశాఖ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఏపీ నుండి వస్తున్న కారు భద్రాచలం శివారు ప్రాంతంలోకి వచ్చి ఆగకుండా వెళ్లిపోయింది. కారును ఆపేందుకు ఎక్సయిజ్ శాఖ అధికారులు ప్రయత్నించారు. కారును వెంబడించగా, దుండగులు రామాలయం ప్రాంతంలో కారును వదిలేసి పరారయ్యారు. అధికారులు కారును పరిశీలించగా, అందులో గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం మీదుగా ఝార్ఖండ్‌కు కారులో గంజాయిని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన గంజాయి మొత్తం 150 కిలోలు ఉంటుందని అధికారులు తెలిపారు. కారును సీజ్ చేశారు. కార్ ఎవరిదనే విషయాన్ని ఆరా తీస్తూ ఉన్నారు అధికారులు.