తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ మరోసారి కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకోగా.. కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయిందని మంత్రి గంగుల ట్విట్టర్ వేదికగా తెలిపారు. కొద్ది రోజులుగా తనను కలిసి వారు ఐసోలేషన్ కు వెళ్లి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరారు. హుజురాబాద్ బై పోల్స్ సమయంలో కూడా కోవిడ్ బారిన పడ్డ మంత్రి అప్పుడు ఐసోలేషన్ కు వెళ్లారు. మరోసారి గంగులకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది.
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 20,044 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 18,301 మంది కోలుకోగా 56 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,40,760కి పెరిగింది. ప్రస్తుతానికి దేశంలో 4,37,30,071 కేసులు నమోదయ్యాయి. 4,30,63,651 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,25,660 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 4.80 శాతంగా, క్రియాశీల రేటు 0.32 శాతంగా, రికవరీ రేటు 98 .48 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,99,71,61,438 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.