More

    గ్యాంగ్స్టర్ పర్వేజ్ ను మట్టుబెట్టిన యూపీ పోలీసులు

    ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్(ఎస్.టి.ఎఫ్.) గ్యాంగ్స్టర్ పర్వేజ్ అహ్మద్ ను మట్టుబెట్టింది. ఆదివారం నాడు ఎస్.టి.ఎఫ్. టీమ్ అతడిని ఎన్ కౌంటర్ చేసింది. బిఎస్పీ నేత జుగారాం మెహందీని రెండేళ్ల కిందట హత్య చేశాడని పర్వేజ్ అహ్మద్ పై అభియోగాలు ఉన్నాయి. ఆ హత్య జరిగిన తర్వాత నేపాల్ కు పారిపోయాడు పర్వేజ్. అతడి మీద లక్ష రూపాయల రివార్డు కూడా ఉంది.

    ఆదివారం నాడు అతడు గోరఖ్ పూర్ దగ్గర ఉన్న పిపిగంజ్ లో పోలీసుల కంటబడ్డాడు. తన సహచరుడితో పాటూ మోటార్ సైకిల్ పై వెళుతుండడాన్ని పోలీసులు గుర్తించారు. నేపాల్ నుండి గోరఖ్ పూర్ కు కొందరిని కలవడానికి పర్వేజ్ అహ్మద్ వచ్చినట్లు తెలుస్తోంది. అతడిని పోలీసులు చుట్టుముట్టి సరెండర్ అవ్వాలని కోరారు. అతడు వినిపించుకోకుండా పోలీసుల మీద కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు అతడి మీద కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో పర్వేజ్ అహ్మద్ కన్నుమూశాడు.

    మే నెలలో కూడా ఓ బిజినెస్ మ్యాన్ ను పర్వేజ్ బెదిరించినట్లు తెలుస్తోంది. తాను కోరిన డబ్బులు ఇవ్వాలని.. లేదంటే చంపేస్తానని బెదిరించాడు. సదరు బిజినెస్ మ్యాన్ పర్వేజ్ చెప్పినట్లు చేయలేదు.. దీంతో అతడిని చంపేశాడు. అప్పటి నుండి ఎస్.టి.ఎఫ్. టీమ్ పర్వేజ్ అహ్మద్ కోసం మాటు వేసింది. అతడిని ప్రాణాలతోనే పట్టుకోవాలని ప్రయత్నించగా ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.

    పర్వేజ్ అహ్మద్ అంబేద్కర్ నగర్ జిల్లాలోని మఖదూమ్నగర్ ప్రాంతానికి చెందిన వాడు. అండర్ వరల్డ్ డాన్ లైన ఖాన్ ముబారక్, చోటా రాజన్ లకు సన్నిహితుడు. పాకిస్థాన్ ఫేక్ కరెన్సీ రాకెట్ లో కూడా పర్వేజ్ అహ్మద్ హస్తముంది.

    బిఎస్పీ నేత జుగారాం మెహందీ హత్య

    15 అక్టోబర్ 2018.. ఉదయం 10 గంటల సమయంలో బిఎస్పీ నేత జుగారాం మెహందీ మీద హిరాపూర్ బజార్ లో కాల్పులకు తెగబడ్డారు. ఆ దాడిలో జుగారాం మెహందీ చనిపోయారు. ఆయన డ్రైవర్ కూడా మరణించాడు. అలాగే మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఖాన్ ముబారక్.. ఇంకో 10 మంది పైన కేసు నమోదు చేశారు. ఖాన్ ముబారక్ ప్రస్తుతం హర్దోయి జైలులో ఉన్నాడు.

    Trending Stories

    Related Stories