National

ఈద్గా మైదానంలో వెలసిన ‘వినాయకుడు’.. ప్రారంభమైన ఉత్సవాలు

హుబ్బలి ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలను కర్ణాటక హైకోర్టు అనుమతించడంతో ఆగస్టు 31న వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ మైదానంలో వినాయకుడి పూజకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ వక్ఫ్‌ బోర్డు పిటిషన్‌ వేసింది. మంగళవారం రాత్రి.. హుబ్బలిలోని ఈద్గా మైదాన్‌లో గణేశోత్సవ వేడుకలను అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అత్యవసర పిటిషన్‌ను కోర్టు రాత్రి 10 గంటలకు విచారించింది. న్యాయస్థానం ఈద్గా మైదాన్‌లో గణేష్ చతుర్థి చేసుకోవచ్చంటూ తీర్పును ఇచ్చింది. ఇక ఈరోజు ఉదయం.. ఆ ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

బెంగుళూరులోని చామరాజ్‌పేటలోని ఈద్గా మైదాన్‌లో గణేష్ చతుర్థి వేడుకలను సుప్రీంకోర్టు నిలిపివేసిన కొన్ని గంటల తర్వాత.. హుబ్బలి ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలను కర్ణాటక హైకోర్టు అనుమతిస్తూ ప్రకటన వచ్చింది. ఈద్గా మైదాన్‌లో మూడు రోజుల పాటు గణపతి విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుమతి ఇచ్చేందుకు హుబ్బళ్లి-ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (హెచ్‌డిఎంసి) కూడా అంగీకరించింది.

Related Articles

Back to top button