More

    ఫన్ బకెట్ భార్గవ్ మళ్లీ అరెస్ట్.. సెంట్రల్ జైలుకు తరలింపు

    ఫన్ బకెట్ భార్గవ్ మళ్లీ అరెస్ట్ అయ్యాడు. ఈ నెల 11 వరకు రిమాండ్‌ విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది. ఆరు నెలల క్రితం పెందుర్తి వేపగుంట సింహపురికాలనీకి చెందిన 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడని భార్గవ్‌ను దిశ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌ విధించారు.ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యాడు. మళ్లీ సోషల్‌ మీడియాలో కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తూ పోస్టులు పెట్టడం, అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దిశ పోలీసులు నిందితుడ్ని తిరిగి అరెస్ట్‌చేసి న్యాయస్థానంలో శుక్రవారం హాజరుపరిచారు. నిందితుడికి ఈనెల 11వరకు రిమాండ్‌ విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం కేజీహెచ్‌లో వైద్యలు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు దిశ పోలీస్‌స్టేషన్‌ ఏసీపీ ప్రేమ్‌కాజల్‌ వెల్లడించారు.

    కొద్ది నెలల కిందట 14 ఏళ్ల బాలికని నమ్మించి ఆమె గర్భం దాల్చేలా చేయడంతో భార్గవ్ పై విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆదేశాలతో పోలీసులు విచారణ జరిపారు. ‘దిశ’, ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి భార్గవ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి పంపారు. 94 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న భార్గ‌వ్ బెయిల్ పై బయటకి వచ్చాడు. జైలు నుండి వచ్చిన భార్గవ్ మళ్లీ యూట్యూబ్ వీడియోలు చేస్తూ, పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. బెయిల్ పై బయటకు వచ్చాక బెయిల్ నిబంధనలను ఉల్లంఘించాడు. దీంతో భార్గవ్ పై దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ మెమో ఫైల్ చేశారు. కేసు విచారణలో ఉండగా సాక్షులను ప్రభావితం చేసేలా భార్గవ్ ప్రకటనలు చేసినట్టు మెమోలో పొందుపరిచారు పోలీసులు. దీంతో పోక్సో కోర్ట్ బెయిల్ రద్దు చేసి రిమాండ్ విధించడంతో మరో సారి జైలు పాలయ్యాడు. ఈ నెల 11 వరకూ అతడు రిమాండ్ లో ఉండనున్నాడు.

    Trending Stories

    Related Stories