More

  పుచ్చకాయలపై ఉమ్మివేస్తూ పట్టుబడ్డ ఫర్హాన్

  ఇటీవలి కాలంలో ఎంతో మంది వర్తకులు అమ్మే వస్తువుల మీద కావాలనే ఉమ్మి వేస్తూ కనిపిస్తూ ఉన్నారు. పోలీసులు సదరు వ్యక్తులను అరెస్టు చేస్తున్నా కూడా ఇలాంటి ఘటనలు ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు. కావాలనే ఇలాంటి పనులను చేస్తూ ఉన్నారు. అలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫ్ఫర్ నగర్ లో చోటు చేసుకుంది. పుచ్చకాయలను అమ్ముతున్న ‘మొహమ్మద్ ఫర్హాన్’ అనే వ్యక్తి వాటి మీద ఉమ్మివేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అతడి వద్ద కొనుక్కోడానికి వచ్చిన వాళ్లకు వాటిని ఇస్తూ ఉన్నాడు.

  స్థానికంగా ఉండే ఓ వ్యక్తి మొహమ్మద్ ఫర్హాన్ పుచ్చకాలను అమ్ముతూ ఉండడాన్ని చూశాడు. అతడు కాయను కట్ చేసిన తర్వాత అందులో ఉమ్మి వేయడాన్ని గుర్తించాడు. అక్కడి సీసీటీవీ కెమెరాల్లో కూడా ఇదే ఘటన రికార్డు అయ్యింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. పోలీసులు సీసీటీవీ విజువల్స్ ను పరిశీలించి మొహమ్మద్ ఫర్హాన్ ను అరెస్టు చేశారు. ముజఫ్ఫర్ పోలీసులు అతడిపై కేసును నమోదు చేశారు. ప్రస్తుతం ఫర్హాన్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో ఇలాంటి ఘటనలే వరుసగా చోటు చేసుకుంటున్నాయి.

  ఇలాంటి ఘటనలు ఎన్నో:

  గురుగ్రామ్ పోలీసులు ఏప్రిల్ నెలలో ఓ ఢాబా ఓనర్ పై కేసును నమోదు చేశారు. ఆ ఢాబాలో తందూరి రోటీలపై ఉమ్మివేస్తూ కనిపించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

  మార్చి 2021న మోసీన్ అనే వ్యక్తిని ఘజియాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతడు రోటీల మీద ఉమ్మివేయడం వంటివి చేస్తూ ఉండేవాడు. పోలీసుల విచారణలో ముస్లిమేతరులు రోటీలను ఆర్డర్ ఇస్తే వాటిపై ఉమ్మివేస్తూ వచ్చానని.. ఇలా కొన్ని సంవత్సరాలుగా చేశానని వెల్లడించాడు.

  మార్చి నెల ఆఖరి వారంలో మొహమ్మద్ ఖలిక్ అనే వ్యక్తి ఢిల్లీలోని హోటల్ లో తిండి పదార్థాలపై ఉమ్మివేస్తూ ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే..!

  ఢిల్లీ పోలీసులు ఇలాంటి ఘటనలోనే మొహమ్మద్ ఇబ్రహీం, అన్వర్ అనే ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. శీలంపురా లోని హోటల్ లో వాళ్లు పని చేస్తూ ఉండే వారు.

  ఫిబ్రవరి 20న మీరట్ పోలీసులు నౌషద్ అలియాస్ సోహైల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. పెళ్లిళ్ల కోసం తయారు చేస్తున్న భోజనంలో ఉమ్మివేయడాన్ని ఓ వీడియోగా చిత్రీకరించారు.

  spot_img

  Trending Stories

  Related Stories