More

    జమ్మూ కశ్మీర్ లో 1.5 లక్షల ఫ్రీ డిష్ టీవీలను ఉచితంగా ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం

    జమ్మూ కశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల కుటుంబాలకు దూరదర్శన్ డిష్ టీవీ సౌకర్యాలను ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. ఆయన ఇటీవల కేంద్రపాలిత ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ విషయాన్ని ప్రకటించారు. “DD ఫ్రీ డిష్ ప్లాట్‌ఫారమ్ ద్వారా సుదూర, సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలను చేరుకోవాలనే లక్ష్యాన్ని సాధించడానికి, కేబుల్ సర్వీస్ లేని ప్రాంతాలలో 1.5 లక్షల ఉచిత డిష్ టీవీలను పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని” ఆయన తెలిపారు. “దానికి సంబంధించిన టెండరింగ్ ప్రక్రియ మొదలైంది.. అతి త్వరలో పూర్తవుతుంది” అని I&B మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటనలో ఉంది

    అపూర్వ చంద్ర మాట్లాడుతూ.. ప్రజలకు డిష్ టీవీలను ఉచితంగా అందిస్తూ ఉన్నామని.. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చంద్ర తెలిపారు. శ్రీనగర్‌లోని దూరదర్శన్ కేంద్రానికి గతంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ సమర్ధవంతంగా తన విధులను నిర్వర్తించినందుకు ప్రశంసించారు. కేంద్రం తన కార్యక్రమాల ద్వారా స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని, ప్రామాణికమైన సమాచారంతో ప్రజలకు చేరువవుతుందని ఆయన అన్నారు. ఉచిత సేవను అందించినందుకు కంగన్‌ ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రాంతీయ భాషలను ఇతర ప్రాంత ప్రజలకు చేరవేయడంలోనూ.. విస్తృత శ్రేణిలో వార్తలు, వినోదాన్ని అందించడంలో కీలకంగా మారనున్నాయి.

    అపూర్వ చంద్ర తో పాటు ఆల్ ఇండియా రేడియో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ న్యూస్ ఎన్‌వి రెడ్డి, దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ మయాంక్ అగర్వాల్, పిఐబి అదనపు డైరెక్టర్ జనరల్ (శ్రీనగర్) రాజిందర్ చౌదరి, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు కీలక సమావేశంలో పాల్గొన్నారు. దూరదర్శన్ యొక్క ఉచిత డిష్ టీవీ అనేది ప్రసార భారతి యాజమాన్యంలో మరియు నిర్వహించబడుతున్న ఏకైక Free-to-Air Direct-to-Home (DTH) సేవ. దీనికి ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ రుసుము లేదు. సెట్-టాప్-బాక్స్, ఉపకరణాలతో కూడిన చిన్న డిష్ యాంటెన్నాను కొనుగోలు చేయడానికి ₹2,000 ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాలి.

    Trending Stories

    Related Stories