అమరావతి ఉద్యోగులకు ఇచ్చిన ఉచిత వసతిని ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు ఇచ్చిన ఉచిత వసతి రద్దు చేస్తూ సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారంలోగా సదరు ఉద్యోగులు ఉంటున్న ఫ్లాట్లను ఖాళీ చేసివ్వాలని ఆదేశించింది. ఖాళీ చేసిన ఫ్లాట్‌లను మంచి స్థితిలో అప్పగించాలని.. ఏమైనా నష్టం జరిగితే సంబంధిత ఉద్యోగులదే బాధ్యతని స్పష్టం చేసింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ నుంచే పాలన సాగించాలన్న నిర్ణయం తీసుకున్న నాటి టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులను అమరావతికి తీసుకుని రాగా.. హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి కల్పించింది. వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేసింది. ఇప్పుడు ఈ ఉచిత వసతిని వైసీపీ సర్కారు రద్దు చేసింది.