International

21మంది భారతీయులను తరలించిన ఫ్రాన్స్

ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న భారతీయులను తరలించడానికి భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇప్పటికే కొందరిని భారత ప్రభుత్వం అక్కడి నుండి తీసుకుని వచ్చింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్పేస్ ను మూసి వేసి ఉంచడం.. కాబూల్ ఎయిర్ పోర్టులో పరిస్థితులు అంత గొప్పగా లేకపోవడంతో భారతీయులను తిరిగి తీసుకుని రావడంలో ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి.

ఫ్రాన్స్ కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ దేశ ప్రజలను తరలించడానికి విమానాన్ని పంపింది. తాము పంపిన ఎవాక్యుయేషన్ విమానంలో 21 మంది భారతీయులను కూడా తరలించినట్లు ఫ్రాన్స్ తెలిపింది. ఈ విషయాన్ని ఫ్రెంచి రాయబారి ఎమాన్యుయేల్ లెనైన్ వెల్లడించారు. మొదటి ఫ్రెంచి విమానంలో 21 మంది భారత పౌరులను, ఫ్రెంచి ఎంబసీకి రక్షణగా ఉన్న గూర్ఖాలను తరలించడం జరిగింది. మంత్రులు జీన్ వైవ్స్ లె డ్రియాన్, ఎస్. జైశంకర్‌తో మాట్లాడినట్లే ఈ చర్యలు తీసుకున్నాం. భారత్‌కు ఫ్రాన్స్ చురుగ్గా సహకారం అందిస్తోంది అని లెనైన్ ట్వీట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిపై ఫ్రెంచ్ అధికారులు భారత అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నారని ఆయన అన్నారు. అయితే కాబూల్ నుండి తమ చివరి విమానంలో తమ ఎంబసీకి కాపలాగా ఉన్న 100 మంది నేపాలీ గూర్ఖాలను కెనడా వదిలివేసి వెళ్ళింది.

మరోవైపు తాలిబాన్లు ప్రభుత్వ ఏర్పాటు చేయాలని భావిస్తూ ఉన్నారు. బ్రిటన్ ఆర్మీ చీఫ్ సర్ నిక్ కార్టర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని తాలిబాన్లకు ఇవ్వాలని అన్నారు. అందరం ఓర్పుతో ఉండాలని, ఆందోళనను నియంత్రించుకోవాలని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని తాలిబాన్లకు ఇస్తే బాధ్యతాయుతంగా మారిన తాలిబాన్లను చూసే అవకాశం ప్రపంచానికి దక్కుతుందని చెబుతున్నారు. మనకు తెలిసిన 1990ల నాటి తాలిబన్ల కంటే ఇప్పటి తాలిబాన్లు భిన్నమైనవారు అయ్యుండొచ్చని చెప్పారు. తాలిబాన్లు అందరూ ఒకే భావజాలంతో ఉండరని వారిలో కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయని అన్నారు. బ్రిటన్ మాజీ సైనికాధికారి హెర్బర్ట్ మాత్రం తాలిబాన్లను గుర్తించే విషయంలో తొందరపాటు వద్దని అన్నారు. తమ పాలనకు అంతర్జాతీయ గుర్తింపు కావాలని తాలిబాన్లు కోరుకుంటున్నారని చెప్పారు. బలప్రయోగం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్లు.. సహజంగానే వినసొంపుగా మాట్లాడతారని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ను పూర్తిగా వదిలి పెట్టేంత వరకు వారు ఓపికగా ఉంటారని చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

16 − nine =

Back to top button