More

    ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్.. నాలుగో రోజు కూడా వర్షార్పణమే

    భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ నాలుగో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. ఈ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండడంతో కనీసం ఒక్క సెషన్ కాదు కదా.. ఒక్క బంతి కూడా వేయడానికి సాధ్యపడలేదు. లంచ్ తర్వాత కూడా వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు నేడు ఆట రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తొలిరోజు నుండి వరుణుడు, సరిగా వెళుతురు లేకపోవడం వంటి ఎన్నో సమస్యలు మ్యాచ్ కు అంతరాయం కలిగిస్తూనే ఉంది. ఇప్పటికే తొలి రోజు ఆట రద్దు కావడంతో మ్యాచ్ కు రిజర్వ్ డే కేటాయించడం తెలిసిందే. అయినా కూడా ఫలితం వస్తుందా అనే నమ్మకం అయితే కనిపించడం లేదు. రిజర్వ్ డేను కలుపుకుని ఇంకా రెండు రోజులు ఉంది. ఇప్పటికీ కివీస్ మొదటి ఇన్నింగ్స్ కూడా పూర్తవ్వలేదు. రాబోయే రెండు రోజులు కూడా వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ విభాగం తెలిపింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 217 పరుగులకు ఆలౌట్ కాగా, కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 101 పరుగులు చేసింది. భారత్ స్కోరుకు ఇంకా 116 పరుగులు వెనుకబడే ఉంది. ఇప్పుడు నాలుగో రోజు కూడా మ్యాచ్ రద్దయింది.

    Trending Stories

    Related Stories