More

    తక్కువ ధరకే టాబ్లెట్స్ ఇప్పిస్తామని మైనర్ బాలికపై యువకుల అత్యాచారం.. ఎక్కడో తెలుసా..!

    హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో ఓ మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చాంద్రాయణగుట్టలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న 16 ఏళ్ల బాలిక ఫిబ్రవరి 4న సమీపంలోని ఫార్మసీలో మందులు కొనేందుకు వెళ్లింది. అదే సమయంలో అక్కడ ఆమె వద్దకు వచ్చిన ఓ గుర్తుతెలియని మహిళ అదే మందులను తక్కువ ధరకు ఇప్పిస్తానని చెప్పింది. ఆ మహిళ బాలికను కందికల్ గేట్ వద్దకు తీసుకువెళ్లి అక్కడ మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులకు అప్పగించింది. మైనర్ బాలికతో వారు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఏడవడం ప్రారంభించింది. ఆమెను అక్కడ ఒక గదిలో బంధించిన నలుగురు యువకులు, శబ్దం బయటకు రాకుండా మ్యూజిక్ సిస్టమ్‌ సౌండ్ ను ఎక్కువగా పెట్టారు. ఆమెకు మత్తుమందు కలిపిన శీతల పానీయాన్ని బలవంతంగా తాగించి, మత్తులో ఉన్న యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.ఆమెను అక్కడికక్కడే వదిలి పారిపోయారు. బాలిక మత్తు నుంచి తేరుకుని మరుసటి రోజు ఉదయం ఇంటికి చేరుకుంది. జరిగిన ఘోరాన్ని బాలిక తల్లికి తెలియజేయగా, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకులు, మహిళను గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

    Trending Stories

    Related Stories