Uncategorized

అక్కడ ఎంఐఎం కు ఊహించని షాక్.. నలుగురు ఎమ్మెల్యేలు జంప్

మ‌జ్లిస్ పార్టీ (ఏఐఎంఐఎం)కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు జంప్ చేశారు. బీహార్ రాష్ట్రంలో నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు పార్టీని మారిపోయారు. AIMIM రాష్ట్ర అధ్యక్షుడు మరియు అమౌర్ ఎమ్మెల్యే అక్తరుల్ ఇమాన్ తప్ప.. మిగిలిన నలుగురు ఇతర ఎమ్మెల్యేలు RJDలో చేరారు. ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే ఇమాన్ మాత్రమే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి విధేయుడిగా కొనసాగుతున్నారు.

2020లో బీహార్ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌జ్లిస్ ఏకంగా 5 సీట్ల‌ను గెలుచుకుంది. అయితే ఇప్పుడు ఆ ఐదురుగు మ‌జ్లిస్ ఎమ్మెల్యేల్లో న‌లుగురు ఆర్జేడీలో చేరిపోయారు. ఈ మేర‌కు మ‌జ్లిస్‌కు చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు బుధ‌వారం ఆర్జేడీ కీల‌క‌ నేత‌ తేజ‌స్వీ యాద‌వ్ స‌మ‌క్షంలో ఆర్జేడీలో చేరారు. మ‌జ్లిస్‌ను వ‌దిలి ఆర్జేడీలో చేరిన వారిలో ముహ్మ‌ద్ ఇజార్ అస్ఫీ (కొచ్చాడామ‌మ్‌), ష‌హ‌నాజ్ అలం (జోకిహ‌ర్‌), సయ్య‌ద్ ర‌క్నుద్దీన్ (బైసీ), అజార్ న‌యీమీ (బ‌హ‌దుర్గుని)లు ఉన్నారు. ఈ న‌లుగురు పార్టీని వదలడంతో ఇక మ‌జ్లిస్‌లో అమౌర్ నుంచి విజ‌యం సాధించిన అఖ్త‌రుల్ ఇమాన్ ఒక్క‌రు మాత్ర‌మే మిగిలారు.

Related Articles

Back to top button