పంజాబ్ మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు.. పాపం నలుగురు జవాన్లు..!

0
433

పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 4.35 గంటల సమయంలో భటిండా మిలిటరీ స్టేషన్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. వెంటనే క్విక్‌ రెస్పాన్స్‌ బృందాలు స్టేషన్‌ను చుట్టుముట్టాయని, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయని వెల్లడించింది. ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చేపట్టామని తెలిపింది.

భటిండా మిలిటరీ స్టేషన్ కాల్పుల ఘటనలో ఎలాంటి ఉగ్రవాద కోణం లేదని పంజాబ్ పోలీసు వర్గాలు తెలిపాయి. భటిండాలోని ఆర్మీ కాంట్ అన్ని ప్రవేశ ద్వారాలు మూసివేశారని.. సుమారు రెండు రోజుల క్రితం 28 కాట్రిడ్జ్‌లతో కూడిన ఒక ఇన్సాస్ రైఫిల్ కనిపించకుండా పోయిందన్నారు. ఈ సంఘటన వెనుక కొంతమంది ఆర్మీ సిబ్బంది ఉండవచ్చని పంజాబ్ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.