ఆయన కేంద్ర మాజీ మంత్రి. అంతే కాదు ఓ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లు అధ్యక్షుడిగా పని చేశారు. అలాంటి నాయకుడు అందరికీ ఆదర్శంగా ఉండాల్సింది పోయి.. భార్యను వదిలేసి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. తన ఇంట్లోనే ఆ మహిళతో రాసలీలల్లో మునిగి తేలుతున్న ఆ నాయకుడిని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
గుజరాత్‌కు చెందిన భరత్ సింగ్ సోలంకి గతంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. అయితే తన భార్య రేష్మా పటేల్‌తో భరత్ సింగ్‌కు చాలా కాలం నుంచి విబేధాలు ఉన్నాయి. ఆమె నుంచి విడాకులు కూడా కోరాడు. ఇద్దరికి ఇద్దరు బహిరంగంగానే విమర్శించుకుని, పబ్లిక్ నోటీసులు జారీ చేసుకున్నారు. ఈ క్రమంలో భరత్ సింగ్ మరో మహిళలతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. గుజరాత్ ఆనంద్‌లోని తన బంగ్లాలో ఆ మహిళతో భరత్ సింగ్ సన్నిహితంగా ఉన్న సమయంలో రేష్మా పటేల్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
అనంతరం ఆ మహిళ జుట్టు పట్టి బయటకు ఈడ్చుకొచ్చింది రేష్మా పటేల్. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసింది. దీంతో రేష్మా దాడిని భరత్ సింగ్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. భరత్ సింగ్‌పై ఎలాంటి చర్యలకు ఆదేశించలేదు.