జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి దినకర్ గుప్తా

0
891

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి దినకర్ గుప్తా నియమితులయ్యారు. పంజాబ్ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన గుప్త 31 మార్చి 2024 వరకు, లేదంటే ఆయన పదవీ విరమణ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. చత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 1987 ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) స్పెషల్ డైరెక్టర్ స్వాగత్ దాస్‌.. హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ (MHA) ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత)గా నియమితులయ్యారు. 30 నవంబరు 2024 లేదంటే ఆయన పదవీ విరమణ తేదీ వరకు లేదంటే, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయనీ పదవిలో కొనసాగుతారు.

పంజాబ్ మాజీ డీజీపీ, 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి దినకర్ గుప్తా జాతీయ దర్యాప్తు సంస్థ కొత్త చీఫ్‌గా నియమితులయ్యారు. గుప్తా పదవీ విరమణ తేదీ 2024 మార్చి 31 గా చెబుతున్నా.. ప్రభుత్వం నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతారు. “జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్‌గా, పోస్ట్ స్థాయి-17లో 31.03.2024 వరకు దినకర్ గుప్తా, IPS (PB: 87) నియామకం కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ప్రతిపాదనను క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది” అని ఆర్డర్‌లో చదవబడింది. 1987-బ్యాచ్ IPS అధికారిని గత ఏడాది అక్టోబర్‌లో చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పోలీసు చీఫ్‌గా తొలగించి పంజాబ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ (PPHC) ఛైర్మన్‌గా నియమించింది. చన్నీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గుప్తా ఒక నెల సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం 1988-బ్యాచ్ అధికారి ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోతాకు బాధ్యతలు అప్పగించింది.