More

    కమలదళానికి ‘మేథో’ బలం..
    కేరళలో సరికొత్త రాజకీయం..!

    కేరళ బీజేపీలోకి మేథో వలస వెల్లువెత్తుతోంది. ఎన్నికల ముందు రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. దశాబ్దాల పాటు ప్రజాసేవలో అపార అనుభవం గడించిన.. మాజీ పబ్లిక్ సర్వెంట్స్ బీజేపీలోకి క్యూ కడుతున్నారు. మెట్రో మ్యాన్ శ్రీధరన్ తో ప్రారంభమైన మాజీ అధికారులు చేరికలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మాజీ ఐఏఎస్, ఐపీఎస్ లతో పాటు.. న్యాయాధికారులు కూడా కాషాయ కండువా కప్పుకుంటున్నారు. పదవీ విరమణ పొందిన ఇద్దరు న్యాయమూర్తులు తాజాగా బీజేపీలో చేరారు. కేరళ హైకోర్టులో జడ్జీలుగా పని చేసిన పీఎన్ రవీంద్రన్, వి.చితంబరేష్‌.. మరో 18 మందితో కలిసి కేరళ బీజేపీ అధ్యక్షుడు కె. సురేంద్రన్ ఆధ్వర్యంలో పార్డీ కండువా కప్పుకున్నారు.

    ఎర్నాకులంలో కొనసాగుతున్న విజయయాత్రలో వీరి బీజేపీలో చేరారు. అయితే, ఢిల్లీలో ఉన్న వి. చితంబరేష్.. అక్కడి నుంచే పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా తాను విద్యార్థిగా ఉన్న రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. పలక్కడ్‌లోని విక్టోరియా కాలేజీలో బీజేపీకి చాలా కాలం మద్దతుదారుగా ఉన్నట్లు వెల్లడించారు. బీజీపీలో చేరిన ఇద్దరు జడ్జీలు.. కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చిన ‘లవ్ జిహాదీ’ బిల్లుకు మద్దతిచ్చారు.

    ఇక, ఇద్దరు జడ్జీలతో పాటు మాజీ డీజీపీ వేణుగోపాల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ జనరల్ మేనేజర్ సోమచూడన్, మిలిటరీ మాజీ అధికారి బీఆర్ మీనన్‌లతో సహా మరికొంత మంది కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలో చేరారు. బ్రాహ్మణులకు రిజర్వేషన్లు, లవ్ జీహాద్, జాతీయవాదం అంశాలపై మొదటి నుంచీ గొంతు వినిపిస్తోన్న ఇద్దరు మాజీ జడ్జీలు బీజేపీలో చేరడంతో అక్కడ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

    Trending Stories

    Related Stories