గంగూలీకి జెడ్ కేటగిరీ..!

0
336

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి భద్రతను మరింత పెంచారు. ఆయనకు ఉన్న సెక్యూరిటీని Z కేటగిరీకి అప్‌గ్రేడ్ చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సీనియర్ అధికారి తెలిపారు. గంగూలీకి కల్పించిన వై కేటగిరీ భద్రత పదవీకాలం ముగియడంతో తాజాగా అప్ గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గంగూలీకి VVIP భద్రతా కవర్ గడువు ముగిసిందని ప్రోటోకాల్ ప్రకారం సమీక్ష జరిగిందని.. గంగూలీ భద్రతను తాజాగా Z కేటగిరీకి పెంచాలని నిర్ణయించారని సీనియర్ అధికారులు తెలిపారు. కొత్తగా అందించిన భద్రత ప్రకారం గంగూలీ చుట్టూ 8 నుండి 10 మంది పోలీసులు రక్షణగా ఉంటారు.

మంగళవారం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సెక్రటేరియట్ ప్రతినిధులు గంగూలీ బెహలా కార్యాలయానికి చేరుకున్నారు. స్థానిక పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. ఆయన సెక్యూరిటీ పెంచడంపై చర్చించారు. గంగూలీ ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టుతో కలిసి ఉన్నాడు. మే 21న కోల్‌కతాకు తిరిగి చేరుకోనున్నారు. ఆ రోజు నుండి Z కేటగిరీ భద్రతను అందిస్తామని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ సివి ఆనంద బోస్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీలకు జెడ్ ప్లస్ భద్రత ఉండగా.. ఫిర్హాద్ హకీమ్, మోలోయ్ ఘటక్ వంటి మంత్రులకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. ఇక సౌరవ్ గంగూలీ పొలిటికల్ ఎంట్రీ గురించి చాలా సంవత్సరాల నుండి చర్చ జరుగుతూనే ఉంది.