తమిళనాడు రాజకీయ నేత, సినీ హీరో విజయకాంత్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ గత కొన్ని రోజులుగా తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆయన కుడి కాలి మూడు వేళ్లను వైద్యులు తొలగించారు. మధుమేహంతో బాధపడుతున్న ‘కెప్టెన్’ కాలి వేళ్లకు రక్తం సరఫరా కాకపోవడంతో వైద్యులు అత్యవసరంగా ఆ వేళ్లను తొలగించినట్టు డీఎండీకే వర్గాలు తెలిపాయి. మధుమేహంతో బాధపడుతున్న ఆయన కాలి వేళ్లకు రక్తం సరఫరా కాకపోవడంతో వైద్యులు అత్యవసరంగా ఆ వేళ్లను తొలగించినట్టు డీఎండీకే తెలిపింది. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని పార్టీ పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని.. ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దని అభిమానులు, కార్యకర్తలను కోరింది.
కెప్టెన్ విజయకాంత్ రాజకీయాల్లో అడుగుపెట్టి 2005లో పార్టీని స్థాపించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే పేలవ ప్రదర్శన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పార్టీ ప్రాముఖ్యత క్రమంగా తగ్గింది. ఆరోగ్య పరిస్థితుల కారణంగా బహిరంగంగా కనిపించడం కూడా తగ్గించేశారు. ప్రస్తుతం ఆయన భార్య ప్రేమలత, బావమరిది సుధీష్లు పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు విజయకాంత్ 2005లో తన సొంత రాజకీయ పార్టీని స్థాపించారు. 2006 ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసి 8.4 శాతం ఓట్లను సాధించింది. కెప్టెన్ కోలుకోవాలని సూపర్ స్టార్ రజనీకాంత్ ట్వీట్ చేశారు. ‘నా ప్రియ మిత్రుడు విజయకాంత్ త్వరగా కోలుకుని మునుపటిలా కెప్టెన్గా గర్జించాలని సర్వశక్తిమంతుడైన దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ రజనీ ట్వీట్ చేశారు.