ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్ని నిబంధనలు తీసుకొచ్చినా.. మతోన్మాదులు రెచ్చిపోతునేవున్నారు. లవ్ జిహాద్ పేరుతో బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతూనేన్నారు. లవ్ జిహాద్ పై యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అయినా, విష సంస్కృతి విస్తరిస్తూనేవుంది. ఇటీవలికాలంలో లవ్ జిహాద్ కేసులు పెరుతుండటమే ఇందుకు కారణం. హిందువులుగా పేర్లుమార్చుకుని మరీ.. హిందూ యువతులను ట్రాప్ చేస్తున్నారు. దీంతో నిందితులను గుర్తించడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు పూనుకుంది.
బలవంతపు మతాంతర వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠినమైన చట్టం తీసుకొస్తున్నామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరికలు జారీ చేశారు. వివాహానికి మత మార్పిడి అవసరం లేదని.. ఇప్పటికే అలహాబాద్ హైకోర్టు తేల్చిచెప్పిందని.. ఈ నేపథ్యంలో లవ్ జిహాద్‌ను అరికట్టేందకు కొత్త చట్టం అమల్లోకి తెస్తామని యోగి ఆధిత్యనాథ్ తెలిపారు. వ్యక్తిగత గుర్తింపును దాచిపెట్టి మా సోదరీమణుల గౌరవంతో ఆడుకునేవారిని నేను హెచ్చరిస్తున్నా.. మీరు మీ ప్రవర్తన మార్చుకోకపోతే.. ‘రామ్ నామ్ సత్య్’ జర్నీ ప్రారరంభమవుతుందని హెచ్చరించారు.
కేవలం మతం మార్చాలన్న దురుద్దేశంతోనే.. మైనార్టీ ఉగ్రవాదులు లవ్ జిహాద్ పేరిట హిందూ యువతులను ఆకర్షిస్తున్నారని.. బీజేపీ, దాని అనుబంధ పార్టీలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. యూపీలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా పంచాయితీ ఎన్నికలకు ముందు ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పటివరకు ఆ చట్టం ఎక్కడా దుర్వినియోగం కాలేదు. జిల్లా పంచాయితీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ తర్వాత ఓ జాతీయ మీడియా ఛానెల్ తో మాట్లాడిన యోగి.. బలవంతంగా మతమార్పిడి చేయడం కేవలం ఒక మతానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని.. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అన్నారు.
నిందితులు మొదట మూగ, చెవిటి బాలికలను టార్గెట్ చేస్తున్నారని.. వాళ్ల ద్వారా కుటుంబంలోకి ప్రవేశించి.. ఆ తర్వాత మొత్తం కుటుంబాన్నే మతం మార్చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా మూగ, చెవిటి బాలికలకు రహస్య సంకేతాలతో వాట్సాప్ ద్వారా శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. అలాంటి సంకేతాలను సైబర్ నిపుణులు మాత్రమే అర్థం చేసుకోగలరని సీఎం పేర్కొన్నారు. అంతేకాదు, ట్రాప్ చేసిన మూగ, చెవిటి బాలికలను మానవబాంబులుగా మార్చి.. ముఖ్యమైన ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలు, వీవీఐపీలపై దాడి చేయడానికి ఉపయోగిస్తున్నారని యోగి స్పష్టం చేశారు. ఈ కుట్రను రాష్ట్ర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చేధించాయని తెలిపారు.
యూపీ యాంటీ టెర్రర్ స్క్వాడ్ తాజాగా ఓ భారీ మతమార్పిడి రాకెట్‌ను చేధించింది. ఢిల్లీలోని జామియా నగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు.. దర్జీల ముసుగులో మూగ, చెవిటి విద్యార్థులతో పాటు.. ఇతర పేద పిల్లల్ని ఇస్లాంలోకి మారుస్తున్నట్టు గుర్తించారు. పాకిస్తాన్ ఐఎస్ఐ నిధులతో ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నట్టు తేల్చారు. మతం మారితే, నగదుతో పాటు, ఉద్యోగంతో పాటు వివాహం జరిపిస్తామని.. బాధిత పిల్లలు, మహిళలకు ఆశజూపి మతం మార్చినట్టు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన వ్యక్తుల్లో ఒకడైన ఉమర్ గౌతమ్ అనే వ్యక్తి తాను ఇస్లాం స్వీకరించడమే కాకుండా.. ఇప్పటికే ఓ వెయ్యిమందిని మతం మార్చాడు. ఈ విషయాన్ని పోలీసుల ముందు తానే స్వయంగా ఒప్పుకున్నాడు. తాను వెయ్యిమందిని ఇస్లాంలోకి మార్చడమే కాకుండా ముస్లిం యువకులతో పెళ్లిళ్లు కూడా జరిపించినట్టు తెలిపాడు.
అంతేకాదు, డబ్బు, ఉద్యోగం ఆశజూపి.. ఈ దుర్మార్గుడు నోయిడాలోని మూగ, చెవిటి పాఠశాల నుంచి 1500 మంది పిల్లల్ని మతం మార్చినట్టు ఒప్పుకున్నాడు. ఇలాంటి దారుణ ఘటనలను తీవ్రంగా పరిగణించిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. బలవంతపు మతమార్పిడులను నియంత్రించడానికి ఒక స్పష్టమైన వ్యూహాన్ని రూపొందించాలని అధికారాలను ఆదేశించారు. ఓ పద్దతి ప్రకారం నిందితులు బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నారని.. వీటిని అడ్డుకోవడానికి అవసరమైతే ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చే అవకాశం వుందని ఓ అధికారి చెప్పారు. అసరమైతే 500 మంది అధికారులతో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన బలవంతపు మతమార్పిడులకు అడ్డుకట్ట వేయాలని యోగి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.