More

    బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్.. రహస్య ప్రాంతాలకు విద్యార్ధుల తరలింపు..!

    బాసరలోని ట్రిపుల్ ఐటీలో ఫుడ్‌ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిన్న 200 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో విద్యార్థులు బాధపడుతున్నారు.

    క్యాంపస్‌లోని ఆస్పత్రిలో కొంతమంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. మరికొంత మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. ఫుడ్‌ పాయిజన్‌ జరగడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

    అయితే గత కొంతకాలంగా విద్యార్ధులు మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ-1, ఈ-2 హస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఎగ్ కర్రీ రైస్ కలుషితం అయినట్లు తెలుస్తోంది. అయితే గుట్టుచప్పుడు కాకుండా విద్యార్ధులకు చికిత్స అందించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.

    వాంతులు చేసుకున్నవారికి వారి వారి హాస్టల్ రూముల్లోనే ఉంచి మాత్రలు ఇచ్చారు. అస్వస్థకు గురైన వారికి అంబులెన్స్‌తో పాటు ఫ్యాకల్టీ కార్లలో నిజామాబాద్ కు తరలించారు. అయితే విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. విద్యార్దులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

    spot_img

    Trending Stories

    Related Stories