మన దేశంలో ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా కారణంగా కొందరి ట్యాలెంట్ బయటకు వస్తూ ఉంటుంది. చాలా సార్లు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కొన్ని ఫన్ తో కూడిన ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు సెలెబ్రిటీలు కూడా అయిన సంగతి మనం మర్చిపోకూడదు. తాజాగా ఒక దోశె మాస్టర్ గురించి ఇంటర్నెట్ లో తెగ చర్చ జరుగుతోంది. అయితే ఈ చర్చ ఆ దోశె మాస్టర్ గురించి కాదు..! దోశె చేసాక వేగంతో అతడు పెనం నుండి పక్కకు విసిరేయడం.. అవతలి వ్యక్తి క్యాచ్ చేయడం. మీరు ఇంకా ఆ వీడియో చూడకుంటే.. ఇక్కడ చూసేయండి.
గతేడాది పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను ఆశ్చర్యపరిచిన దోశెల విక్రేత.. ఈసారి RPG ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకాను కూడా ఆశ్చర్యపరిచాడు. గోయెంకా ప్రత్యేక శైలిలో దోశెలను అందిస్తున్న వ్యక్తికి సంబంధించిన కొత్త క్లిప్‌ను పంచుకున్నారు. అతడు చేస్తున్న పనిని చూసి గోయెంకా షేర్ చేశారు. “మీరు చేసే పనిని మీరు ప్రేమించాలి, మీ బెస్ట్ ను అందించండి…”(“You have to love what you do, to give your best…”) అంటూ పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న క్లిప్‌లో, దోశె మాస్టర్ తయారు చేసిన వెంటనే ఎడమ వైపుకు దోశెను విసరడం.. మరొక వ్యక్తి దానిని ప్లేట్‌లో పట్టుకోవడం కనిపిస్తుంది. అది కూడా ఎంతో వేగంగా క్షణాల్లో జరిగిపోతూ ఉండడం గమనించవచ్చు. దోశె ఎట్టి పరిస్థితుల్లోనూ కిందకు పడే ఛాన్స్ ఇవ్వలేదు వారిద్దరూ..! ఈ వీడియోకు పలువురు ఆసక్తికరమైన కామెంట్లు చేయడం మనం గమనించవచ్చు.