విమానంలో షాకింగ్ ఘటన.. సిబ్బంది భోజనంలో పాము తల..!

0
785

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. ఇవి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటాయి. ఇందులో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తే, మరికొన్ని షాక్‌కు గురిచేస్తుంటాయి. ఈ కోవకే చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్టో చక్కర్లు కొడుతోంది.

ఫుడ్ ప్యాకెట్‌లో పాము తల కనిపించడంతో ఆకాశంలో ఎగురుతున్న విమానంలోని సిబ్బంది కేకలు వేసినట్లు ఈ వీడియోలో చూడొచ్చు. టర్కీ రాజధాని అంకారా నుంచి జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌కు వెళ్తున్న సన్‌ఎక్స్‌ప్రెస్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఫుడ్ ప్యాకెట్‌లో పాము తలని చూసి ఎంతో భయపడ్డానని ఓ విమాన సహాయకురాలు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లలో చర్చ మొదలైంది.

వైరల్ అవుతున్న వీడియోలో, విమాన సిబ్బంది ఆహార ప్యాకెట్లను చూపిస్తున్నట్లు చూడొచ్చు. వీటిలో ఓ సలాడ్ ప్యాకెట్‌లో కత్తిరించిన పాము తల కనిపించిందని సిబ్బంది తెలిపారు. వీడియోలోని సలాడ్ ప్యాకెట్‌పై దృష్టి సారిస్తే, అందులో పాము తల చూడొచ్చు.

క్యాబిన్ సిబ్బంది ఆహారంలో పాము తల కనిపించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ట్విట్టర్‌లో @DidThatHurt2 అనే అకౌంట్‌తో ఈ వీడియోను పంచుకున్నారు. సన్‌ఎక్స్‌ప్రెస్ విమానంలో ఆహారంలో కత్తిరించిన పాము తల కనిపించింది. ఈ సంఘటన తర్వాత, విమానయాన సంస్థ ఆహార సరఫరా సంస్థపై తక్షణమే చర్య తీసుకుని, కాంట్రాక్టును తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఘటన ఆమోదయోగ్యం కాదని విమానయాన సంస్థ తెలిపింది. ఇంతకు ముందు ఆహారంలో నత్త కూరుకుపోయిందనే వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here