8వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

0
769

8వ తరగతి విద్యార్థినిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె సోదరుడిని ఓ గదిలో బంధించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి సోదరుడిని నిందితులు తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. బాధితురాలు, ఆమె సోదరుడు మతపరమైన ప్రాంతం నుండి తమ ఇంటికి తిరిగి వస్తుండగా నిందితులు కిడ్నాప్ చేశారు. నిందితులు బాధితురాలి సోదరుడిని గదిలో బంధించి, బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలిని, ఆమె సోదరుడిని కూడా నిందితులు బెదిరించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు మోదీనగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.